న్యాయ వ్యవస్థకు సమర్థుల కొరత ఉంది


నల్సర్‌ స్నాతకోత్సవంలో సుప్రీం సీజే సదాశివం
హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) :
న్యాయవ్యవస్థకు సమర్థుల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్‌ సదాశివం అన్నారు. సమర్థులైన న్యాయాధికారుల అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. సమర్థుల  కొరత ఎదుర్కొం టున్నందున ప్రతిభావం తుల అవసరం ఎక్కువగా ఉంటుందని అన్నారు. శనివారం నిర్వహించిన హైదరా బాద్‌  నల్సార్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకో త్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ను తయారు చేయడమే కాకుండా వారికి సామాజిక కోణంలో ఆలోచిం చి న్యాయ వ్యవస్థ కోసం పాటుపడే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. న్యాయ విద్య పట్టా అందుకున్న విద్యార్థులు డబ్బు, ¬దా, పరపతి వంటి అంశాల కంటే నీతి, విలువలు కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకునే విధంగా, సామాన్య ప్రజలకు సేవ చేసే విధంగా తయారుకావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అప్పుడే వారికి సాజంలో తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. ఈ స్నాతకోత్సవంలో ఏడువందల మందికి పట్టాలు అందించారు. 47మంది విద్యార్థులు వివిధ అంశాల్లో కనబరిచిన ప్రతిభకు బంగారు పతకాలను అందుకున్నారు. ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చదివినందుకు గర్వంగా ఉందని బంగారు పతకాలు సాధించిన వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్‌ జ్యోతి కల్యాణ్‌సేన్‌ గుప్తా, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.