ప్రశాంతంగా పోలింగ్‌


ఎవరి లెక్కలు వారివే
గెలిచిన కొమ్మ పట్టిన పార్టీలు
పూర్తయిన ఓట్ల లెక్కింపు
హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) :
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ రాష్ట్రంలో ప్రశాంతం గా ముగిసింది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ శాతం బాగా పెరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండో విడత పోలింగ్‌లో చిన్నా చిత క సంఘటనలు మినహా ఎలాంటి అవాంచనీయ సం ఘటనలు చోటు చేసు కోలే దన్నారు రాష్ట్రవ్యాప్తంగా 87.14శాతం పోలింగ్‌ నమో దైందన్నారు. ఇందులు ఆదిలాబాద్‌లో 82శాతం, అనంతపూర్‌ 89, చిత్తూరులో 89.9శాతం, గుంటూరులో 85, కర్నూల్‌లో 86శాతం, మహబూబ్‌నగర్‌ 87, నెల్లూరు 92, ప్రకాశం 88, నెల్లూర్‌ 94.9, శీకాకుళం 87.5, విశాఖపట్నం 85.5, పశ్చిమగోదావరి 87, వరంగల్‌లో 88.8శాతం నమోదైందన్నారు. ఇందులో కాస్తా హెచ్చుతగ్గులు కూడా ఉండే అవకాశాలున్నా పెద్దగా తేడా ఉండదన్నారు. రెండో విడతగా వాస్తవానికి 7735 పంచాయితీలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా 65 జీపీలు 31వ తేదీకి వాయిదా పడగా, 266 పంచాయితీలకు నామినేషన్లు రాలేదని, 674 ఏకగ్రీవంగా జరిగాయన్నారు. ఇవిపోగా 6971 పంచాయితీలకు పోలింగ్‌ జరుగగా 20వేల 712మంది అభ్యర్థులు రంగంలో నిలిచారన్నారు. అలాగే 78160 వార్జులకు గాను 678 31వతేదీకి వాయిదావేయగా, 18934 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. అలాగే 58వేల784 వార్డులకు లక్షా 36వేలమంది రంగంలో నిలిచారన్నారు. రాష్ట్రంలో 11వేల 505 బెల్టుషాపులు తొలగించడం జరిగిందన్నారు. 1916 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాంలు వినియోగించగా, 23120 కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేయించామన్నారు. 2470 పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18కోట్ల 6లక్షలకుపైగా నగదును, వెండి ఉంగరాలను, కళ్లజోళ్లను, ఆయుదాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. శనివారం జరిగిన ఎన్నికల్లో తమ అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల బ్యాలెట్‌ పేపర్లు అవసం మేరకు లేకపోవడం, కొన్నిచోట్ల ముద్రణ తప్పుగా జరిగిందన్నారు. ఇలాంటి వాటిలో పోలింగ్‌ను 31వ తేదీకి వాయిదా వేశామన్నారు. నల్గొండ జిల్లా కొండాపూర్‌, వరంగల్‌ జిల్లా ఫిరోజ్‌ పూర్‌, మాడుగుల గ్రామంతోపాటు విశాఖపట్నంలో జి.మాడుగుల, పెద్దబాయలలో పోలింగ్‌ను ఈనెల 31వతేదీకి వాయిదా వేశామన్నారు. అలాగే అభ్యర్థులు మృతి వల్ల తూర్పుగోదావరి జిల్లాలో రెండు గగన్‌పల్లి, చిల్లకూర్‌, అనంతపూర్‌లో ఒకటి పాల్యంల ఎన్నికను వాయిదా వేయడం జరిగిందన్నారు. కడప జిల్లా టికెపల్లిలో జరిగిన ఘటనపై కలెక్టర్‌ను నివేదిక కోరామని, అది రాగానే రాత్రికి నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి  144 సెక్షన్‌, పోలీస్‌ 30యాక్టును వినియోగించాలని ఆదేశించామని రమాకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బందోబస్తును ఆదివారం ఉదయం 9గంటలవరకు కూడా ఉంచనున్నామన్నారు. మేజర్‌ పంచాయితీల్లో పెద్ద భవనాల్లో కౌంటింగ్‌ను ఏర్పాటుచేయాలని, టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా మూలపాడులో జరిగిన ఘర్షణలో ప్రజాప్రతినిధిని అరెస్ట్‌ చేయడం జరిగిందని దీనిపై కలెక్టర్‌ నుంచి నివేదిక కోరామన్నారు. మొత్తం విూద ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. మూడో విడత ఎన్నికల ఏర్పాట్లకు ముందుకెల్తున్నామన్నారు. కడపటి వార్తలు అందేసరికి వివిధ పార్టీల మద్దతు దారులు గెలుపొందిన స్థానాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు  జిల్లాలో కాంగ్రెస్‌ 62, తేదేపా 181, వైకాపా 139, ఇతరులు 79, అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ 61, టీడీపీ 140, వైకాపా  44, ఇతరులు 14, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ 70, తెదేపా 70 వైకాపా 2, తెరాస 35, ఇతరులు 44, మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 159, తెదేపా 60 తెరాస 104 , ఇతరులు 59, నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 81, తెదేపా 61, వైకాపా 3, టీఆర్‌ఎస్‌ 53, ఇతరులు 35, కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 156, తెదేపా 52, వైకాపా 19, టీఆర్‌ఎస్‌ 139, ఇతరులు 149, ఆదిలాబాద్‌ జిల్లాలో 76, తెదేపా 40, టీఆర్‌ఎస్‌ 74, ఇతరులు 113, వరంగల్‌         జిల్లాలో కాంగ్రెస్‌ 103, టీడీపీ 82, వైకాపా 6, టీఆర్‌ఎస్‌ 75, ఇతరులు 29, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ 194, టీడీపీ 107, వైఎస్సార్‌ సీపీ 33, టీఆర్‌ఎస్‌ 49, వామపక్షాలు 42, ఇతరులు 26, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ 84, టీడీపీ 116  , వైఎస్సార్‌ సీపీ 90, వామపక్షాలు 57, ఇతరులు 22, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ 138, టీడీపీ 103, వైఎస్సార్‌ సీపీ 24,  టీఆర్‌ఎస్‌ 51, ఇతరులు 97, శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌ 156, తెదేపా 105, వైకాపా 64, వామపక్షాలు 4, ఇతరులు 47, విజయనగరం కాంగ్రెస్‌ 225, తెదేపా 182, వైకాపా 61, వామపక్షాలు 1, ఇతరుల 41, విశాఖపట్నం కాంగ్రెస 83, తెదేపా 148, వైకాపా 84, వామపక్షాలు 2 ఇతరులు 35, తూర్పు గోదావరి కాంగ్రెస్‌ 112, తెదేపా 96, వైకాపా 77, ఇతరులు 38, పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌  71, తెదేపా  99, వైకాపా  64, ఇతరులు 49, కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ 36 తెదేపా 105, వైకాపా 64, ఇతరులు 17, గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌  55, తెదేపా 112, వైకాపా 67, ఇతరులు 28, ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్‌106, తెదేపా 166, వైకాపా 139, ఇతరులు 57, నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్‌ 49, తెదేపా 38, వైకాపా 87, ఇతరులు 54, కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌127, తెదేపా 42, వైకాపా  90, ఇతరులు  27, కడప  జిల్లాలో కాంగ్రెస్‌  70, తెదేపా 46, వైకాపా 115, ఇతరులు 25 చోట్ల గెలుపొందారు. అయితే వీరిలో పలువురి తమ పార్టీ వారిగా అన్ని రాజకీయ పక్షాలు చెప్పుకున్నాయి. గెలిచిన కొమ్మను పట్టుకొని తమ మొక్కే అని బొంకేశాయి.