జర జూస్కోయమ్మా..


మా యమ్మ మహంకాళి
ఉజ్జయిని దర్శించుకున్న కేసీఆర్‌, కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) :
ద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జర జూస్కోయమ్మా.. మా యమ్మా మహంకాళి.. మా ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని నెరవేర్చేలా చూడమని మొక్కుకున్నారు. ఉజ్జయినీ మహంకాళీ బోనాలు ఆదివారం ఉదయం నాలుగు గంటలకు లష్కర్‌ బోనాలతో ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్‌, కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రాయల తెలంగాణను ఒప్పుకోరని స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇవ్వాలని మహంకాళిని మొక్కుకున్నామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల నమ్మకం లేదని, తెలంగాణను అడ్డుకునేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందకు తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని వీడబోమని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు బిల్లుపెట్టే వరకూ తాము కాంగ్రెస్‌ పార్టీని నమ్మబోమని కోదండరామ్‌ అన్నారు.