సీడబ్ల్యూసీ సమావేశం ఎజెండా తెలియదు: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని… ఎజెండా మాత్రం తెలియదు అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై అధిష్ఠానానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు అని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే విషయం తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.