ములాయం వెనుక సీఎం కిరణ్‌,చంద్రబాబు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే లగడపాటి రాజగోపాల్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంటున్నారని, ఆయనకు ఎప్పుడో విజయావాడ ప్రజలు రాజకీయ సన్యాసం ఇచ్చారని తెలిపారు. లగడపాటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ఆగదు అని స్పష్టం చేశారు.