బెంగాల్‌ ‘పంచాయతీ’లో తృణమూల్‌ హవా


కోల్‌కతా, జూలై 29 (జనంసాక్షి) :
పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి ఎదురులేదట్లుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితుల్లో తృణము ల్‌ కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో 17 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో దాదాపు మొత్తం పంచాయతీలనినంటినీ గెలిచిం ది. మొత్తం పంచాయతీల్లో 90 ాతానికి పైగా తృణముల్‌కే దక్కాయి.ప్రతిపక్ష సీపియం నేతృత్వంలో లెప్ట్‌నెంట్‌ 2008 ఎన్నికల్లో 13 జిల్లాల్లో ఆధిపత్యం కనిపించినా, ఈ సారి మాత్రం కనీసం ఒక్క జిల్లాలో కూడా నామమాత్ర ఉనికి కూడా చూపించలేక పోయింది. జల్పాయిగురి జిల్లాలోని చాలా వరకు గ్రామ పంచాయతీల్లో  ఆధిక్యం కనపర్చినా, చివరకు మాత్రం చతికిల పడింది. నాదియా జిల్లాలో తృణముల్‌, వామపక్ష్యాల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఒక్కప్పుడు కాంగ్రేస్‌ కంచుకోటగా ఉన్న ముర్షీద్‌లో దాదాపు సగం పంచాయతీలు ఆ పీర్టీకి దక్కాయి.మాల్టాలో తృణముల్‌ గట్టిపోటీ ఇవ్వగలిగింది. ఉత్తర దింజాపూర్‌లో వామపక్ష కూటమికి దాదాపు సగం పంచాయతీలు వచ్చాయి. 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలు , పంచాయతీ పమితుల్లో కౌంటింగ్‌ పూర్తి కాగా.. మమత మ్యాజిక్‌ చాలా జిల్లాల్లో కనిపించింది.దక్షిణ బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో తృణముల్‌ తన ప్రత్యర్థుల కంటే బాగా ముందుంది. ఒక్క నాదియా తప్ప మిగిలిన జిల్లాలంన్నింటిలోనూ భారీ సంఖ్యలో పంచాయతీలు తృణముల్‌కే దక్కాయి.హుగ్లీ జిల్లాలోని సింగూరులోను, తూర్పు మడ్నపూర్‌లోని నందిగ్రామ్‌లోనూ తృణముల్‌ తన పట్టు నిలబెట్టుకుంది. ఈ ప్రాంతాల్లో ఉద్యమాలతో సాధించిన మద్దతు ఆ పార్టీకి బాగా ఉపయోగపడింది. ఒకప్పుడు ఎర్రకోటలుగా నిలిచిన బర్ద్వాన్‌, బంకూరా, బిర్భూమ్‌, ఉత్తర 24 పరగణాలు, పశ్చిమ మిడ్నపూర్‌, కూచ్‌ బీహార్‌, హూగ్లీ జిల్లాలన్నింటిలో వామపక్ష కూటమి బాగా దెబ్బతింది. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 1.69 లక్షల మంది అభ్యర్థులు పోటీలో నిలకడగా, వారిలో సగానికి పైగా.. అంటే దాదాపు 90 వేల మంది మహిళలే!!బవీరంతా కలిపి మొత్తం 58,865 పంచాయతీలకు పోటీ పడ్డారు. 17 జిల్లా పరిషత్తుల పరిధిలో 755 జడ్పీ స్థానాలుండగా, 341 పంచాయతీల్లో 8,864 పంచాయతీ సమితి నియోజక వర్గాలున్నాయి. 2008 ఎన్నికల్లో వామపక్ష కూటమి 13 జిల్లా పరిషత్తులను గెటుచుకోగా, కాంగ్రెస్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు రెండేసి మాత్రమే దక్కాయి.