యువ ఐఏఎస్‌ దుర్గపై నివేదిక ఇవ్వండి


యూపీకి కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) :
యువ ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ ఉదంతంపై నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు దుర్గాశక్తిని మొదట బదిలీ చేసిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తర్వాత సస్పెండ్‌ చేసింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు సీఎం అఖిలేశ్‌యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయంపై ఒత్తిడి తెచ్చి ఆమెను సస్పెండ్‌ చేయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపనలు గుప్పిస్తున్నాయి. అయితే తనకు అన్యాయం జరిగిందని దుర్గాశక్తి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. దుర్గాశక్తి వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సోనియాగాంధీ ప్రధానికి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం నుంచి యూపీ సర్కార్‌కు ఆదేశాలు వెళ్లడం గమనార్హం.