తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగఫలితమే

1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్యతో పాటు 4500 మంది అమరుల రక్త దర్పణంతో ప్రారంభమైన వీర తెలంగాణ విపోష్ట్ర్లవ సాయుధ పోరాటం 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని పది జిల్లాలతో కలిపి ప్రకటించింది యుపిఏ ప్రభుత్వం. ఇది ప్రజా చరిత్రాత్మకమైన విజయం వేలాది మంది తెలంగాణ పోరాటంలో హోరా హోరి పోరాడి చివరికి తమ తమ రక్తాలను దారపోసి చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించారు. యుపిఏ చైర్మన్‌ సోనియాగాంథీ పేరు వచ్చే తరాలకు కూడా గుర్తుండిపోతుంది. తెలంగాణ ప్రజాస్వామిక పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే. మూడు కోట్ల మంది చిరకాల స్వప్నం నెరవేరింది. తెలంగాణ పోరాటం రష్యా అక్టోబర్‌ విప్లవాన్ని తలపించింది. 1946లో తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు నిజాం నిరంకుశ దోపిడికి వ్యతిరేకంగా కమ్మూనిస్టులు రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మొగ్ధుం మొహియిద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి, నాయకత్వంలో తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి నాలుగు వేల గ్రామాలలో ఎర్రజెండాలను ఎగురవేసి ఆనాడు ఉన్న 90 లక్షల ప్రజానీకానికి అండగా నిలిచారు. తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. మగ్ధుం మోహియిద్దీన్‌ ఇవాళ ప్రపంచ చరిత్ర పటంలో తెలంగాణ అమరత్వంతో శికరమైంది పది జిల్లాల తెలంగాణ ప్రజల పోరాటం అంతిమ పోరాటం టిఆర్‌ఎస్‌ పార్టీ 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆవిర్భవించినప్పటికీ పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి దాకా టిఆర్‌ఎస్‌ తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని ఎన&ఇనకల కోసం వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తిగా విఫలమైయ్యారు. తెలంగాణ కోసం పలు మార్లు టిఆర్‌ఎస్‌ రాజీనామాలు చేసినప్పటికీ ఇది తెలంగాణ కోసం కాదూ కేవలం టిఆర్‌ఎస్‌  మందిత బలోపేతం చేసేందుకేనని అర్థమయింది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొంతమంది నకిలీ పాస్‌పోర్టుల సంక్షభంలో పడిపోవడం టిఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్ధాపించిన వారిలో గాదే ఇన్నయ్య, ఆరె నరేంద్ర మరికొంత మంది అప్పటి ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం అయినప్పటికీ అది కాదు ముఖ్యం. ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 1956 నుంచి 2013 వరకు ఎడతెరిపి లేకుండా ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసిపడింది. వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ అంశం తలక్రిందులు చేసింది. వారి నిజస్వరూపం బయటపడింది. అవకాశవాద పార్టీఅయిన బిజెపి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలయిన బిజెపి కాకినాడు తీర్మానాన్ని మరచిపోయి అప్పటి టిడిపి పార్టీతో పొత్తుపెట్టుకుని తెలంగాణను మరచిపోయింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు చత్తీస్‌ఘడ్‌ జార్ఖండ్‌, ఉత్తరాంచల్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ ప్రజలకు బిజెపికి గౌరవం ఉండేది. కానీ తెలంగాణ వాదాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణవాదాన్ని భుజానవేసుకుని నరేంద్రమోడి ఆంధ్రరాష్ట్రానికి వస్తున్నందుకే తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజ్‌నాథ్‌సింగ్‌ పెద్దన్న పాత్ర పోషించాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడం తమ పార్టీ పోరాటం చేసిందని టిడిపి చెప్పడం ఆయా రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ప్రకటించగానే తమ పార్టీ అంటే తమ పార్టీ అని సొంత డబ్బా కొట్టుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమ ద్రోహానికి పాల్పడిన మర్రి చెన్నారెడ్డి ఉద్యమ చరిత్రలో ద్రోహిగానే మిగిలిపోయాడు. కేవలం గవర్నర్‌ పదవికి అమ్ముడు పోయాడు. అయినా తెలంగాణ ఉద్యమం ఆగలేదు. ఇంద్రారెడ్డి కొన్నాళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్‌లో విలీనం చేసినాడు. ఇలా చెప్పుకుంటు పోతే తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే తెలంగాణకు అనేక విధాలుగా మోసలకు గురయింది. తెలంగాణ తల్లీ ఆత్మగౌరవం, ఆత్మఘోష తల్లడిల్లింది. అయినప్పటికీ ప్రజల మోసాలను తెలంగాణ సమాజం ప్రతీసారి గమనించుకుంటూ వచ్చింది. తెలంగాణకు త్యాగాల చరిత్ర ఉంది. ఉద్యమ నేపధ్యం ఉంది. కమ్యూనిస్టులకు తెలంగాణ పుట్టినిల్లు వంటింది. మొదక్‌ జిల్లా మంజీరా రచయిత సంఘం తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభల పేరిట పెద్ద ఎత్తున ఉద్యమాలను నడపించింది. బహిరంగ సభలు నిర్వహించింది. తెలంగాణ వాదాన్ని కాపాడింది. అవమానాలు భరించారు. ఆకలిని భరించారు. తెలంగాణ ప్రజానీకం అణచివేతలు దోపడి అన్యాయాలకు గురవుతు వచ్చారు. రైతులు చేనేత కార్మికులు నిరుద్యోగులు ఆకలి చావులు ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడినారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అజాంజుహి మిల్లు పేపరు పరిశ్రమ హెచ్‌ ఎంటి తదితర పరిశ్రమలు టూల్స్‌ చార్‌మినార్‌ ఆలల్వీన్‌ హెచ్‌ఎంటీ తదితర పరిశ్రమలు మూతపడటంతో వేలాదిమంది కార్మికులు వీధులపాలయినారు. సింగరేణి కార్మికులు శ్రమకు దగ్గ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ ప్రాంత భూములను కార్పొరేటు బడా పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెట్టడంతో తాడు బొంగరం లేని బోడదయింది. రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ నల్గొండ జిల్లాలో కొన్నికొన్ని భాగాలను గ్రేటర్‌ హైదరాబాద్‌లో కలిపినపుడు తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. జలాల, ఉద్యోగాలు, భూమి, బోగ్గు దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా ఆర్థిక అసమానతలు దోపిడికి గురవుతూ వచ్యింది. సీమాంధ్ర పాలకులుతెలంగాణ వరులను గద్దల్లాగా తన్నుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలపై పెత్తనం చేలాయించడం తీవ్రరూపం దాల్చింది. 610 జీవో ఉసేలేదు. పెద్ద మనసుల ఒప్పదం కాలరాసారు. తెలంగాణ ఉద్యమం ప్రజలంతా ఉదృతం చేయడంతో హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం చేయమన్నారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేసినామని గొప్పలు చేప్పుకున్నారు. మాయదారి మాటలతో ఢిల్లీ పెద్దలను తప్పుదోవ పట్టించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చేయరాని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. లాబీయింగ్‌ చేశారు. సమాఖ్యాంధ్ర ఉద్యమం అంటూ కృత్రిమంగా సృష్టించారు. 2009 డిసెంబర్‌ ప్రకటనను అడ్డుకున్నారు. నోటికాడికి వచ్చిన అన్నం బుక్కను దూరం చేశారు. ఆనందపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై అవాకులు చవాకులు పెల్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్రులంతా ఒకటైయ్యారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరిచారు. తాగుబోతులని న్రపచారం చేశారు. లంచాలతో అడ్డుకోగలిగారు. ఇదంతా కేవలం సీమాంధ్ర ప్రజలపై ప్రేమ కాదు లగడపాటి కావూరి రాయపాటి తమ ఆస్థులను కాపాడుకోవడానికి అని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఇవ్వదని తీవ్రమయిన మన స్థాపంతో సుమారు 1300 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. సకల జనుల సమ్మె 43 రోజులుగా జరగడం చరిత్రాత్మకమయినది. కేసీఆర్‌ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం మారమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళింది. స్వచ్ఛందంగా ప్రజలు ప్రజాస్వామిక వాధులు విద్యార్థులు యువకులు న్యాయవాదులు, జర్నలిస్టులు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొన్ని కేంద్రానికి కనువిప్పు కలిగించారు. తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని మరింత శాంతియుతంగా ముందుకు నడిపించారు. తెలంగాణ మార్చ్‌ అసెంబ్లీ ముట్టడి పోలీసు నిర్భందాలు, అణచివేతలను ధిక్కరిస్తూ ముట్టడిని విజయవంతం చేశారు. తెలంగాణ సత్తాను చాటారు. తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఏకం చేయడంలో కోదండరామ్‌ ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ సిద్దాంత కర్తలయిన ప్రోఫెసర్‌ జయశంకర్‌, కాళోజి నారాయణ రావు ఎన్నొ అవమానాలు భరించారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు క్రియాశీల పాత్రను పోషించారు. ప్రజా గాయకురాలు అరుణోదయ విమలక్క పాటలు తూటాలయి పాలకులను ఎదిరించినందుకు విమలక్కపై పదుల సంఖ్యలో తప్పుడు కేసులు బనాయించి మూడు నెలల పాటు నిర్భందించారు. చంచల్‌గూడా జైలులో నిరాహార దీక్ష చేసి లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలను మరిపించింది. లాఠీలకు, తూటాలకు భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో విమలక్క చురుగ్గా పాల్గొని కేంద్రానికి కనువిప్పు కలిగించింది. సిపిఐ, సిపిఐఎంఎల్‌,  జనశక్తి, సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథామావోయిస్టులాంటి పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు జనశక్తి లాంటి విప్లవ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించారు. రాజకీయ పార్టీల మోసాలను ఎండగట్టారు. తెలంగాణ ద్రోహుల నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమం 68 ఏళ్ల తెలంగాణ ప్రజాపోరాటానికి 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు యుపిఏకు ఇది ప్రజా విజయం. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి జీర్ణించుకోలేక సీయాంధ్ర పాలకులు రాజీనామాలకు తెరలేపారు. తెలంగాణ ఉద్యమాన్ని దోచుకోలేకపోతున్నామనే మనోవేధనతో యుపిఏ ప్రభుత్వాన్ని  మరోసారి బ్లాక్‌ మేయిల్‌కు పాల్పడుతున్నారు. అన్నదమ్ముల్లా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి కలిసుందాం. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమనేది సీమాంధ్ర నాయకులు గుర్తెరుగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యావత్‌ ప్రజానీక పోరాట ఫలితంగా ఏర్పాటయింది. ఇది ప్రజల చిరకాల స్వప్నం. మూడు కోట్ల మంది ప్రజల బతుకులు మెరుగుపడతాయని ఆకలిచావులు ఆత్మహత్యలు నిరుద్యోగం, పేదరికం, అణచివేతలు లేని తెలంగాణణ రాష్ట్రాన్ని నిర్మిద్దాం! ప్రజాస్వామిక తెలంగాణను ఏలుదాం. అమరవీరుల ఆశయాలను, కళలను నిజం చేద్దాం. ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుదాం. తెలంగాణ అమరవీరులు దొడ్డి కొమురయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మగ్దుం మెహియిద్ధీన్‌. ధర్మభిక్షం జయశంకర్‌, కాళోజి, బద్దం ఎల్లారెడ్డి, విగ్రహాలను ఏర్పాటు చేయాలి. మానేరు, పోచంపాడు,దేవాదుల, నాగార్జున సాగర్‌ బొడ్డమ్మ చెరువు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రాంతాన్ని పచ్చని పంటలతో నింపి తెలంగాణ తల్లిని గౌరవిద్దాం.

బంగారు తెలంగాణ

వేలాదిమంది ప్రాణ త్యాగాల మూలంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజలు బంగారు బతుకులు బతుకుదామని ప్రజలపై ఎవ్వరి పెత్తనం దోపిడి ఉండవద్దని మరో చైనా రష్యా క్యూబా వెనిజూలా దేవాలలాగా సోషలిస్టు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, బహుళజాతి సంస్థల ఆధిపత్యం కార్పొరేటు దారుల దోపిడి ఉండవద్దని ప్రపంచీకరణ విధానాలకు పాతరేసి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో మార్గదర్శకంగా నిలిపేందుకు యావత్‌ ప్రజానీకం కలిసికట్టుగా కని చేయాల్సిఉంది. తెలంగాణ ఖైదీలు ఎళ్లకు ఏళ్లు జైలు నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలందరిని తెలంగాణ ఏర్పాటు సందర్భంగా విముక్తి కల్పించుదాం. అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ప్రముఖ స్థానాన్ని కల్పించి పోరాట యోధులుగా గుర్తించాలి. భూమిలేని నిరుపేదలకు భూమిని కేటాయించి, ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా అందరూ ఒకే విధంగా బతుకుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు అంకితమిద్దాం. అమరుల కళలలను నిజం చేద్దాం. శాంతియుత తెలంగాణలో కొత్త బతుకులు బతుకుదాం! చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అభివృద్ది సాధ్యం!!

-దామరపల్లి నర్సింహారెడ్డి