సంయమనం పాటించండి


ఆంధ్ర ఉద్యోగులూ ఆందోళన వద్దు
విగ్రహాల విధ్వంసంపై కేంద్రం సీరియస్‌
శాంతిభద్రతలపై కఠినంగా వ్యవహరించమని సీఎంను కోరా : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు పట్టుతప్ప డంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల వారు ముసాయిదా కమిటీకి తమ ప్రతిపాదనలు సమర్పించవచ్చని సూచించా రు. ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. సమస్య పరిష్కారానికి అన్ని ప్రాంతాల వారితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇరు ప్రాంతాల ప్రతినిధుల మధ్య సయోధ్య చేస్తామని తెలిపారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. తెలంగాణ బిల్లు తయారీలో రాజ్యాంగ పరంగా అన్ని విధివిధానాలు అనుసరిస్తామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన విద్యార్థులకు నష్టం జరుగదని అన్నారు. విభజనపై ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రక్రియపై మొదట కేబినెట్‌ భేటీ అవుతుందని, రాష్ట్ర విభజన తీర్మానం చేయాలని కేంద్రం అసెంబ్లీకి సూచిస్తుందని అన్నారు. తీర్మానం తర్వాత మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. విభజన ప్రక్రియ అధికారికంగా కొనసాగుతుండగానే అభిప్రాయాలు కూడా సేకరిస్తామని అన్నారు.కు సహకరించిన టీడీపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఆయన పేర్కొన్నారు.