ఆందోళనలు మానండి


విభజనకు సహకరించండి కోదండరామ్‌కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు మాని రాష్ట్ర విభజనకు సహకరించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. సోమవారం నగరంలోని విద్యుత్‌సౌధలో నిర్వహించిన సద్భావన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ తమదని సీమాంధ్రులు అనడం భావ్యం కాదన్నారు. జోనల్‌ వ్యవస్థ రద్దుకు తాము కూడా వ్యతిరేకమేనని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని సీమాంధ్రులను కోరారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారు ఆందోళన చెందవద్దని సూచించారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతో రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష లేదని అన్నారు. కొందరి డబ్బు సంచులతో ఇప్పుడు అక్కడ ఉద్యమం నడుస్తుందని అన్నారు. తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేస్తే మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కేంద్రం అధీనంలో ఉంటే సహించబోమని హెచ్చరించారు.ున పేర్కొన్నారు.