కిరణ్‌ ధిక్కారస్వరం


ఆంటోని కమిటీ నివేదికిచ్చాకే ప్రక్రియ ప్రారంభించాలి
మా సీమాంధ్ర సమస్యలు తలెత్తుతాయి
ఏకపక్షం వహించిన సీఎం
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. రాష్ట్ర విభజనపై ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చాకే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. తాను తమ పార్టీకి లేఖరాసిన దాంట్లో నూటికి నూరుశాతం సంతకం చేశానన్నారు. ఇది తమకు సమ్మతమేనన్నారు. ముందుగా నీరు, విద్యుత్‌, విద్య, పరిశ్రమలపై సమస్యలు పరిష్కరించాలన్నారు. తెలంగాణలో నేడు కేవలం 53 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, కాని వినియోగం మాత్రం 113 మెగావాట్లుందన్నారు. ఇంత వ్యత్యాసాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారని సీఎం కోరారు. అలాగే ఆంధ్రాలో 120 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంటే 76 మిలియన్‌ యూనిట్లు మాత్రమే వినియోగించుకుంటుందని, అలాగే రాయలసీమలో 33 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే 39 మిలియన్‌ యూనిట్లు వినియోగించుకుంటుందన్నారు. తెలంగాణలోనే అదిక వ్యవసాయ కనెక్షన్లున్నాయని విద్యుత్‌ వారికి అవసరమే అవుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తెలంగాణ పూర్తిగా అంధకారంలో తోసేసినట్లే అవుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ను తీసుకువస్తానని కేసీఆర్‌ చెప్పడం అవగాహనారాహిత్యమే అవుతుందన్నారు. గ్రిడ్‌ కన్వర్షన్‌ కావాల్సి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నది కేవలం 4300 మిలియన్‌ యూనిట్లు మాత్రమేనన్నారు. అది రావాలన్నా గ్రిడ్‌కు అనుసంధానం కావాల్స ఉంటుందన్నారు. రాష్ట్రం విభజన జరిగితే విద్యుత్‌ విషయంలో తెలంగాణాకు ఇక్కట్లు రానుండగా, నీటి విషయంలో సీమాంద్రకు  అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని ప్రాజెక్టులుకూడా తెలంగాణాలో ఉంటూ సీమాంధ్రకు కుడివైపునే ఉన్నాయన్నారు. ఇక్కడ కూడా ప్రతి ప్రాజెక్టులో నీటివిషయంలో సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇటు తెలంగాణాలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌లో,రాయలసీమలో నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 30నుంచి 35 లక్షలఎకరాలు సాగులోకి రావాల్సి ఉందన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టువల్ల కూడా 25లక్షల ఎకరాలు సాగు లో ఉన్నాయన్నారు. రైట్‌ కెనాల్‌ద్వారా ఆంద్రాకు 11 లక్షల ఎకరాలు, 6నుంచి 7లక్షల ఎకరాలు తెలంగాణాకు, క్రిష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు పోతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మూడు వేల టిఎంసిలు గోదావరి నీల్లు సముద్రం పాలయ్యాయన్నారు. ఇదిలా ఉంటే సీమాంద్రకు నీళ్లెలా పంపిణీ చేస్తారని చెప్పాల్సి ఉందన్నారు. దుమ్ముగూడెం టెండర్లు పూర్తి కాక పనులు పూర్తికాలేదన్నారు. దీనివల్ల 165 టిఎంసిల నీరు వినియోగంలోకి వస్తుందన్నారు. కోట్లాదిమంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. కేవలం 49 టిఎంసిలనీటిని ఇవ్వడం వల్లే 13లక్షల ఎకరాల్లో కృష్ణా, గుంటూర్‌, ప్రకాశం జిల్లాల్లో సాగులోకివచ్చిందన్నారు. హైదరబాద్‌ పట్టణం ఇంతకాలం తమది అన్న బావనతోనే ప్రతి ఒక్కరు పెట్టుబడులు పెట్టడంకాని,. స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని వారికి ఖచ్చతమైన భరోసా ఇవ్వాల్సినవసరం ఉందన్నారు. గుంటూర్‌నుంచి హైకోర్టు హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. నేడు 40-50 వేల మంది న్యాయవాదులు, వేలాది మంది డాక్టర్లు నేడు ఇక్కడే పనిచేస్తున్నారన్నారు. వీరందరిని వెళ్లిపోవాలంటే ఎంత దుర్మార్గం అవుతుందన్నారు. సమగ్ర చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతు న్నానన్నారు. తాను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తినన్నారు. ఇది కేవలం కాంగ్రెస్‌ నియమించిన కమిటీ అంటూనే కేంద్రమంత్రులు ఎంపీ ఉన్నందున అన్ని వర్గాల వారు అభ్యంతరాలు చెప్పుకోవచ్చన్నారు. ఉద్యోగులు సమ్మెకు పోవడాన్ని విరమించుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు మంత్రుల కేబినెట్‌ సబ్‌ కమిటీని వేశారన్నారు. వారితో తొలుత చర్చించుకోవాలని సూచించారు. మొదటి రోజు మాత్రమే పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నందున విద్వంసాలు జరిగాయన్నారు. ఆతర్వాత కంట్రోల్‌ చేయడం జరిగిందన్నారు. తెలంగాణాలో ఏవిధంగానైతే వ్యవహరించానో అదే విధంగా సీమాంధ్రలో వ్యవహరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నేడు భారీ వర్షాల వల్ల అన్నిప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు.దీనివల్ల మొత్తం వ్యవసాయం సాగులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఉద్యమాల వల్లతీవ్ర నష్టం సంబవిస్తుంద న్నారు. తెలంగాణ సమస్య ఉత్పన్నానికి ముందు వైఎస్‌ ప్రధాన దోషి అన్నారు. ఆనాడే 2001 టిఆర్‌ఎస్‌ పుట్టకముందే వైఎస్‌ తెలంగాణాకు మద్దతుగా హైకమాండ్‌ వద్దకు ఎమ్మెల్యేలను పంపించాడన్నారు. నేడు కూడా సిపిఎం, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసినందునే కాంగ్రెస్‌ కూడా నిర్ణయం తీసుకుందన్నారు.ఇప్పుడే రాష్ట్రం ఏర్పాటు అయిపోలేదన్నారు. కేంద్రం ఇంకా కసరత్తు చేయాల్సిఉందన్నారు. ప్రతిసమస్యపై పరిష్కారం చూపించాల్సి ఉందన్నారు. ఆతర్వాతే రాష్ట్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆంటోని నేతృత్వంలోని కమిటీని హైదరాబాద్‌ తెప్పిస్తానని ప్రతిఒక్కరు కూడా వారిని కలుసుకుని విజ్ఞప్తులు ఇచ్చుకోవచ్చన్నారు. సమస్యలపై పరిష్కారం చూపించాకనే రాష్ట్ర విభజన చేసుకుంటే తమకు అబ్యంతరం లేదన్నారు. తాను సిఎంగా ఇరు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను మాత్రమే చెప్పానని, తాను రాష్ట్రం విభజించాలనిగాని, ఇవ్వొద్దని గాని చెప్పడం లేదన్నారు. మొత్తంగా సీఎం తాను సమైక్యవాదినని, తెలంగాణ వ్యతిరేకినని చెప్పుకున్నారు.