మాట మార్చడం వారి నైజం


నాడు తెలంగాణకు అనుకూలమన్నారు
ఇవ్వగానే మాట మార్చిన వైకాపా : నారాయణ
హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) :
అఖిలపక్షంలో తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదన్న వైకాపా ఇప్పుడు మాట మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది అత్యంత దారుణమని అన్నారు. ఓ పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పడమేటిమటన్నారు, హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఉండదన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయనచెప్పారు. పోతిరెడ్డిపాడు పోలవరం ప్రాజెక్టులకు తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు.  ఒక భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదని  నారాయణ శనివారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌  ఏర్పాటు చేసిన విూట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. 23 జిల్లాలకు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కిరణ్‌ విస్మరించారని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో సీమాంధ్రుల రక్షణకు తాము భరోసా ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ప్రస్తుతం సీమాంధ్రు వాసులను ఆంధ్రా గో బ్యాక్‌ అని ఎవరూ అనడం లేదని నారాయణ తెలిపారు. తెలంగాణ పోరాటం 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటమని తెలిపారు. ఒక భాష మాట్లాడే వాళ్లు ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్టాల్రు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. 1990లోనే తెలంగాణ కోసం ఉద్యమించాలని పార్టీ జిల్లాల కమిటీ సమావేశాల్లో నిర్ణయం జరిగిందని తెలిపారు. పార్టీలు నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, భాగస్వామ్య పక్షాలతో మాట్లాడిన తర్వాతే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో లొల్లి పెట్టడం తగదు అని అన్నారు.