సీమాంధ్రలో తుస్సుమన్న రైల్‌రోకో


యథాతథంగా నడిచిన రైళ్లు
విశాఖపట్నం, ఆగస్టు 11 (జనంసాక్షి) :
సీమాంధ్ర రైల్‌రోకో తుస్సుమంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా కేంద్రం ప్రకటిం చిన ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సమై క్యాంధ్ర జేఏసీ రైల్‌రోకోకు పిలు పునిచ్చింది. విశాఖపట్నంలో ఆం దోళనకారులు రైల్వేస్టేషన్‌లో నుంచి పట్టాలపైకి వెల్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే భారీ గా మొహరించి ఉన్న పోలీ సులు ఆందోళనకారులను స్టేషన్‌ బయటే అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులకు ఆందోళ నకారులకు మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసులను తోసుకుం టూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రైల్‌రోకో యత్నానికి పాల్పడతారని ముందే కార్యక్రమాన్ని తెలుసుకున్న పోలీసులు ట్రాక్‌ పొడుగునా పోలీసు బలగాలను మొహరించారు. అరెస్ట్‌ చేసిన వారి పై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే సాయంత్రం వరకు ఎక్కడైనా రైల్‌రోకో కార్యక్రమాలను చేపట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. కొద్దిపాటి మంది ఆందోళనకారులు ట్రాక్‌లపైకి రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి.