విన్నపాలు వినవలే


నేటి నుంచి ఆంటోని కమిటీ పని
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత అభ్యంతరాలపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం నుంచి పని ప్రారంభించనుంది. హైదరాబాద్‌, జల, విద్యుత్‌ పంపిణీ తదితర అంశాల్లో సీమాంధ్రుల అభ్యంతరాలపై ఆంటోని కమిటీ విజ్ఞప్తులు స్వీకరించి, వాటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండగానే ఆంటోని కమిటీ సీమాంధ్ర ప్రాంతం నుంచి అభ్యంతరాలను సేకరించి వాటిని హోం మంత్రిత్వ శాఖకు నివేదిస్తుంది. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆంటోని ఎదుట నిరసన తెలిపేందుకు సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని, లేదంటే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.