రాజ్యసభలో తెలం’గానం’


అన్ని పార్టీలను సంప్రదించాకే
తెలంగాణపై నిర్ణయం
టీడీపీ తీసుకుంటే ప్రజాస్వామికం
మా నిర్ణయం నియంతృత్వమా?
తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది
ఉతికి ఆరేసిన చిదంబరం
రంగు బయటపెట్టుకున్న సీమాంధ్ర నేతలు
నిర్ణయమైపోయింది.. అందరూ కట్టుబడాల్సిందే : రాపోలు
తెలంగాణ ఇవ్వాల్సిందే : రాజా
తెలంగాణకు మేం అనుకూలం : బీఎస్పీ
తెలుగులో విచారం వెళ్లగక్కిన హరికృష్ణ
కాంగ్రెస్‌ నిర్ణయానికి కట్టుబడతా : సుబ్బిరామిరెడ్డి
సీపీఎం పాత పాటే
‘ఆత్మ’ రెండో ఎస్సార్సీ సన్నాయి నొక్కులు
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) :
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోమవారం రాజ్యసభలో తె లం’గానం’ ధ్వనించింది. అన్ని పార్టీలను సంప్ర దించాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని అధికార కాంగ్రెస్‌ ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం రాజ్యసభలో తెలంగాణపై చర్చకు డెప్యూటీ చైర్మన్‌ కురియన్‌ అనుమతించారు. ఈ చర్చకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి పి. చిదంబరం సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియ కొనసాగుతుందని ఆయ న స్పష్టం చేశారు. ఎంతకాలం లోగా పక్రియ పూర్తవుతుందనేది మాత్రం చెప్పలేనని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదిం పులు పూర్తిచేసిన అనంతరమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని చిదంబరం వెల్లడించారు. కాంగ్రెస్‌పై విపక్షాలు చేసిన విమర్శలు సరికావన్నారు. టీడీపీ తీసుకుంటే ప్రజాస్వామికం, మా నిర్ణయం నియంతృత్వమా? అని ప్రశ్నించారు. తెలంగాణపై చర్చను స్వాగతిస్తున్నామని, అయితే ఇప్పుడు విస్తృత స్థాయి చర్చకు సాధ్యం కాదని, కేబినెట్‌ నోట్‌ తర్వాత పార్లమెంటులో చర్చకు పెడతామని ఆయన అన్నారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత పక్రియ పూర్తికి చాలా సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల పరిమితిని చెప్పలేనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అడుతున్నారని, అందరినీ సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయని, ఎంతగా విమర్సలు చేస్తే తమ పార్టీ అంతగా బలం పుంజుకుంటుందని ఆయన చెప్పారు. రాజ్యాంగబద్దంగా తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తామని చిదంబరం చెప్పారు. విభజనకు ముందే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను ¬ం మంత్రిగా ఉన్నప్పుడు రెండు సమావేశాలు ఏర్పాటు చేశానని, కొన్ని పార్టీలు తెలంగాణపై నిర్ణయం చెప్పాయని, కొన్ని పార్టీలు చెప్పలేదని ఆయన అన్నారు. పార్టీలు తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక విషయాలను ప్రస్తావించిందని చెప్పారు. జలవనరులు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు గురించి కూడా శ్రీకృష్ణ కమిటీ వివరించిందని అన్నారు. మొత్తం పక్రియలో చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామికమవుతుంది, తాము తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన అడిగారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.  అన్ని సమస్యలను తాము పరిశీలిస్తామని, పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తాము ప్రతిపాదించామని, దానిపై సూచనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.