సీఎం కిరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుపై సీఎం కిరణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. సీమాంద్రలో ఆందోళనలపై సీఎం అలసత్వం తగదని హైకమాండ్ పేర్కొంది. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సీఎం కిరణ్‌దేనని హైకమాండ్ స్పష్టం చేసింది.