కుట్రదారుల ఎత్తులను చిత్తు చేద్దాం


శాంతి ర్యాలీలు చేపడుదాం: కోదండరామ్‌ పిలుపు
హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రదారుల వేస్తున్న ఎత్తులను చిత్తు చేద్దామని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని తెలంగాణ ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణను అడ్డుకొనేందుకకు సీమాంధ్రుల చర్యలు అధర్మమని పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న సీమాంధ్ర పాలకు తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. నెలాఖరులోగా హైదరాబాద్‌లో అన్ని సంఘాలో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలంటూ ఈనెల 17 నుంచి ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షల నిర్వహించనున్నట్లు చెప్పారు. నెలాఖరులో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సీమాంధ్ర వెనుకబాటుకు సీమాంధ్ర మంత్రులే కారణమని కోదండరామ్‌ మండిపడ్డారు. ఆ విషయంలో సీమాంద్ర మంత్రులను వారి భార్యలే నిలదీయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయనీ  వ్యాఖ్యలు చేశారు.