సర్కారు కమిటీ అవసరం లేదు


బిల్లు పెట్టినప్పుడు చర్చలో చెప్పుకోండి
సీమాంధ్ర పార్టీలకు చురక
అన్ని పార్టీల వైఖరి చెప్పాకే యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ ఆగస్టు 14 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రభుత్వ కమిటీ వేయాలన్ని విపక్షాల డిమాం డ్‌ను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌ తోసిపుచ్చారు. ఆంటోనీ కమిటీని కలవడానికి అభ్యంతరం ఉన్న పార్టీలు సభలో తమ వాదనను వినిపించవచ్చని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఏమై నా చెప్పదలచుకుంటే అసెంబ్లీ లేదా పార్లమెంట్‌లో లేదా, ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు చెప్పుకోవచ్చన్నారు. ఏకపక్ష నిర్ణ యం తీసుకున్నారన్న ఆరోపణ లను తిప్పికొట్టారు. అన్ని పార్టీల అభిప్రాయ తీసుకున్నాకే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఇరు ప్రాంతాల నేతలకు స్పష్టం చేశామన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణపై సంప్రదింపులు ముగిశాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశం సున్నితమైనదని.. అనవసర రాద్దాంతం చేయొద్దని నేతలకు సూచించారు. విభజన విషయంలో సీమాంధ్ర నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీకి సీమాంధ్ర మంత్రులను ఆహ్వానించామని.. కలవడానికి అభ్యంతరం ఉన్న పార్టీలు సభలో వాదన వినిపించొచ్చని చెప్పారు. ఆంటోనీ కమిటీ ఉండగా, ప్రభుత్వం తరఫున మరో కమిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రణబ్‌ కమిటీ రాజకీయ పార్టీలను కలిసిందని, ఆ తర్వాత ¬ం మంత్రి షిండే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగిందని.. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ కూడా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఆంటోనీ కమిటీ ఏర్పాటైందన్నారు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం కమిటీ వేస్తే తాను కాదనని తెలిపారు. ¬ం మంత్రిని ఎప్పుడు ఎవరైనా కలుసుకోవచ్చని, అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చన్నారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్టాన్రికి వ్యతిరేకంగా ఆ పార్టీ మాజీ ఎంపీ ఆలే నరేంద్రకు లేఖ రాసిందని, ఆ తర్వాత వారి వైఖరి మార్చుకున్నారని చెప్పారు. తాను ఇరువైపులా కాంగ్రెస్‌ నేతలను నియంత్రిస్తున్నానని తెలిపారు. ఇరు ప్రాంతాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించామన్నారు. విభజన చాలా సున్నితమైన అంశమని, అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఒక ప్రాంతం వారికే కాదు.. అన్ని ప్రాంతాల వారికీ హెచ్చరికలు జారీ చేశామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఆంటోనీ కమిటీ పని ప్రారంభించిందని.. విధి విధానాలపై చర్చించామన్నారు. బుధ, గురువారాల్లో కమిటీ మంత్రులు, ఎంపీలతో సంప్రదింపులు జరుపుతుందని, అలాగే, విద్యార్థులు, ఎన్జీవోలు, రాజకీయేతర సంఘాలు కూడా వారి అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని కోరారు.ూలు