దండిగా సంక్షేమ కార్యక్రమాలు

దేశంలోనే నంబర్‌వన్‌
బంగారుతల్లి ఆడపిల్లల సంరక్షణ కోసం
పంద్రాగస్టు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) :
భారత దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశ స్వాతం తో్యద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొ న్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రం కృషిచేస్తోందన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పేదరికం నిర్మూలనలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నామన్నారు. జాతీయ స్థాయిలో పేదరికం 21.9శాతం ఉంటే రాష్ట్రంలో 9.20శాతం మాత్రమే ఉందన్నారు. గడిచిన కొన్నేళ్లలో చేపట్టిన కార్యక్రమాల ఫలితం వల్ల 156లక్షల మందిని పేదరికంనుంచిపైకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతిపథకం కూడా పేదల అభ్యున్నతికి దోహద పడడమేకాక, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్దికోసం ఉప ప్రణాళకను తీసుకు రావడమేకాక చట్టబద్దత చేశామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఎస్సీ, ఎస్టీలకు సమగ్ర అభివృద్ది జరుగనే లేదన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు 8,585 కోట్లు, ఎస్టీలకు 3,666 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు సిఎం ప్రకటించారు. రాష్ట్రంలోని 13.68 లక్షల మహిళా స్వశక్తి సంఘాలలో 1కోటి మంది సభ్యులున్నారన్నారు. వీరికి 1506 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నామన్నారు. మహిళలు, రైతులు అసలు కడితే చాలు వడ్డీ  ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అభయ హస్తం పథకం క్రింద  ఇప్పటికే అమలులో ఉన్న 45లక్షల మందికి గాను మరో 9లక్షల మందికి చేయూత నిస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు గాను ఇన్‌పుట్‌ సబ్సీడిని 10వేలకు పెంచడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంద రంగాలకు అదనంగా కేటాయింపులు చేస్తున్నామన్నారు. అక్వా రైతులను ప్రోత్సహించేందుకు  నాలా చార్జీలను రద్దు చేసినట్లు ప్రకటించారు. 2004లో చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో 86 ప్రాజెక్టులు చేపట్టి ఇప్పటివరకు అదనంగా 23లక్షల ఎకరాల ఆయకట్టును స్తిరీకరించడం జరిగిందని, మార్చినెలకల్లా అదనంగా 30లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం, ప్రాణహిత- చేవెల్ల ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కంతన్‌పల్లి ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 32లక్షల వ్యవసాయ పంప్‌ సెట్లకు ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను పంపిణీచేసేందుకు 3190కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. గత సంవత్సరం జల విద్యుత్‌ లేని కారణంగా విద్యుత్‌ కొరతను ఎదుర్కొన్నామని, రాష్ట్రంలో బొగ్గు, గ్యాస్‌ కేటాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈసారి భారీగా వర్షాలు కురుస్తున్నందున విద్యుత్‌ కొరత ఉండదన్నారు. ప్రజలకు అవసరమైన అదనపు విద్యుత్‌కోసం జెన్‌కో, సోలార్‌, విండ్‌ ఎనర్జీలను వినియోగించుకో పోతున్నామన్నారు. రాష్ట్రంలో 27లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం కోసం 4500 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. ఆరోగ్యం అభివృద్ది కోసం ఎనలేని కృషిచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 20లక్షల మందికి శస్త్ర చికిత్సలను 5416 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించేందుకు గాను సిబ్బందిని పెద్దఎత్తున నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 108 సర్వీసులను పెంచుతున్నామన్నారు. ఆలాగే 104 సర్వీసుల్లో వైద్యుడితో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామన్నారు. మీసేవ పేరుతో సేవలను 7వేల కేంద్రాలలో అందిస్తున్నామన్నారు. రోజుకు లక్ష యాభై వేల మంది సేవలు పొందుతున్నారన్నారు. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడులను సవిూకరించడంలో నంబర్‌ టూగా ఉన్నామన్నారు. చిత్తూరు, మెదక్‌ జిల్లాల్లో జాతీయ పెట్టుబడుల అభివృద్ధి కేంద్రాలు మంజూరయ్యాయని మరోకటి ప్రకాశం జిల్లాకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. దీనివల్ల పెట్టుబడలు గణనీయంగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 43వేల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఇసుజు మోటార్స్‌ ఆధ్వర్యంలో 1500 కోట్లు, మహింద్రా ట్రాక్టర్స్‌ సంస్థ ద్వారా 3వేల కట్లు పెట్టుబడులు పొందామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగాన్ని గుర్తించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ బాటలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చామన్నారు. రైతులకు 72వేల కోట్ల వ్యవసాయ రుణాలిస్తున్నామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం 6300కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. కృష్ణా మూడో దశ పూర్తి దశకు చేరుకుందన్నారు. ఇప్పటివరకు 164కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ పథకం క్రింద 153 కోట్ల లబ్దిని కల్పించనున్నామన్నారు. అంతకుముందు సిఎం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. పోలీసుల కవాతు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.