ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి మంత్రి టీజీ వెంకటేశ్‌


కర్నూలు, ఆగస్టు 16 (జనంసాక్షి) :
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తు త పరిస్థితులను అవగతం చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏపీఎన్జీవోలు సమ్మె కు దిగడం సరైంది కాదని రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్‌ పేర్కొన్నారు. కర్నూలు పట్టణంలోని పాతనగరంలో వైశ్యులు నిర్వహిస్తున్న వంటా వార్పు కార్యక్రమంలో ఈసందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మెవల్ల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తి కూడా ఇబ్బందుల పాలవుతున్న సందర్బాన్ని గమనించి వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సమ్మెవల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించనుందన్నారు ఆందోళన చేసేందుకు తాము ఇతర వర్గాలున్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముమ్మాటికి టీడీపీ,మంత్రి టీజీ వెంకటేశ్‌ వైసీపీలే కారణమన్నారు. ఆ పార్టీలు ఇప్పటికైనా లేఖలిస్తే తాను దగ్గరుండి ప్రక్రియను ఆపించుకు వస్తానన్నారు. సీమలో ప్రజల ఆందోళనలను హైకమాండ్‌ గమనిస్తుందని తానైతే అనుకుంటు న్నానన్నారు. కేంద్రం మరోసారి ఆలోచించాలని కోరారు. లేని పక్షంలో రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి సీమకు అన్యాయం జరుగకుండా ఆపాలని టిజి వెంకటేశ్‌ కోరారు.