అవకాశవాద రాజకీయాల కోసమే సీమాంధ్ర ఉద్యమం: సీపీఐ

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్ర పెట్టుబడి ఉద్యమంపై సీపీఐ మండిపడింది. అవకాశవాద రాజకీయాల కోసమే సీమంధ్రలో రాజకీయ పార్టీల నాయకులు పోటీపడుతూ ఉద్యమాలు నడిపిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇవాళ ఆయన గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసి సీమాంధ్రుల హక్కులపై కేంద్రం చర్చించాలని సూచించారు.