ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేధం!


కైరో, ఆగస్టు 18 (జనంసాక్షి) :
ముస్లిం బ్రదర్‌ హుడ్‌ పార్టీపై నిషేధం విధించాలని ఈజిప్ట్‌ సైనిక ప్రభుత్వం భావిస్తోంది. పదవీచ్యుత అధ్యక్షుడు మోర్సీకి మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో గత నాలుగు రోజుల్లో 800 మంది మరణించారు. ఇంకా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి తోడ్పాటునిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేదం విధించాలని తీవ్రంగా యోచిస్తున్నారు. ఈమేరకు చట్టబద్దంగా ముస్లిం బ్రదర్‌హుడ్‌ను రద్దు చేసేందుకు సంబంధించి ఆపద్ధర్మ ప్రధాని హజెమ్‌ బెబ్లావీ ప్రతిపాదించారు. 1954 లోనే ఈజిప్టు ప్రభుత్వం బ్రదర్‌హుడ్‌ను రద్దు చేసినా.. ఇటీవలే ప్రభుత్వేతర సంస్థగా అది మళ్లీ నమోదైంది. పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు వెయ్యి మంది బ్రదర్‌హుడ్‌ కార్యకర్తలను పోలీసులు నిర్భందించారు. మరోవైపు మాజీ అపద్ధర్మ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ ఎల్‌ బరాదే తన రాజీనామా ఆమోదం పొందిన వెంటనే ఆస్ట్రేలియాకు పయనమయ్యారని ప్రభుత్వ ఛానెల్‌ తెలిపింది.