హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే


యూటీ అంటే అగ్నిగుండమే : దానం
హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండం అవుతుందని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర ¬దాను కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ విషయంలో రాజీ లేదని, రాజధాని నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ మేరకు తమ అభిప్రాయాలను ఆంటోనీ కమిటీకి వివరిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో దానం విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ రాజధానికి తెలంగా రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే, సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా హైదరాబాద్‌పై అధిష్టానం పునరాలోచన చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రాజధాని నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశముందని వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను తాము అంగీకరించబోమన్నారు. అలాగే, ప్రత్యేక రాష్ట్ర ¬దా కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే హైదరాబాద్‌ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌ విషయంలో రాజీ లేదని, ఆ ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దీనివల్ల హైదరాబాద్‌ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఇదే అంశంపై త్వరలో ఆంటోనీ కమిటీని కలుస్తామని తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై దనం ధ్వజమెత్తారు. కావూరి ప్రతిసారి తన వైఖరి మార్చుకుంటున్నారని, ఆయన తన ప్రాంతం వారిని సంతోషపెట్టడం కోసమే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కావూరి ముందు గతంలో ఈ విషయాలు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఒకసారి మాట ఇచ్చాక వెనక్కుపోరని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగర ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఏఐసీసీ పెద్దలతో తాము మాట్లాడామని, త్వరలోనే ఆంటోనీ కమిటీని కూడా కలిసి హైదరాబాద్‌ ప్రజల మనోభావాలను వివరిస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్‌, ముఖేశ్‌గౌడ్‌ రాజధాని నగరానికి ప్రత్యేక రాష్ట్ర ¬దాను కోరినట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను దానం ఖండించారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, ప్రత్యేక రాష్ట్ర ¬దాను తాము కోరడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.