పేదలు ఆకలి తీర్చేందుకే ‘ఆహార భద్రత’


లాంఛనంగా ప్రారంభించిన సోనియా
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) :
పేదల కోసమే ఆహార భద్రత పథకం అని యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఢిల్లీ సిఎం షీలా దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఆహార భద్రత పథకం కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, ఆహార భదత్ర పథకంవల్ల దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి మేలు చేకూరుతుందని అన్నారు. ఆహార భద్రత పథకం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్వప్నమని ఆమె గుర్తుచేశారు. రాజీవ్‌ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షదాయకమన్నారు.  ఆహార భదత్ర పథకాన్ని తొలుత అమలు చేసిన ఘనత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలోని పేదలకు ఆకలి, పోషకాహార లోపం లేకుండా చూడడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.