సమైక్యవాదానికి కాలం చెల్లింది


ప్యాకేజీయే ముద్దు
బొత్స మనసులో మాట
హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) :
సమైక్యవాదానికి కాలం చెల్లిందని, రా ష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయానికి ప్రతిఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేనని పీసీ సీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన మనోగతంగా బయటపెట్టుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంయ తర్వాత గత 20 రోజులుగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌వాదులు, ప్రతిపక్షాలు సమైక్యంగా ఉంచాలనిగాని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానో, కేంద్ర పరిపాలన క్రింద ఉంచాలనో ఏవేవో ప్రతిపాదనలు ఏమాత్రం ఆచరణకు సాద్యం కానివని గట్టినిర్ణయంతో బొత్ససత్తిబాబు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌పై హక్కుకోరడంకాని, ఇంకేదో చేయాలనే సమయం దాటి పోయిందని ఆయన పలువురు సీమాంధ్రులతో కచ్చితంగానే చెప్పారు. అయితే ఇందులో కొంత మంది మాత్రం ఆయనను వ్యతిరేకించగా, మరికొందరు మాత్రం కేంద్రం వేస్తున్న అడుగులు బొత్స తీసుకు న్న నిర్ణయం సరైనదేనని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీమాంధ్రకు భారీ ప్యాకేజితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు ఇనిస్టిట్యూట్‌లను, యూనివర్శిటీలను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే నేడు సరైన డిమాండ్‌ అని ఇటీవల సిఎం సమక్షంలో సీమాంధ్రుల సమావేశంలో కూడా బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆనాడు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ప్యాకేజీయే ప్రధానం అన్న ఇందులో బాగంగానే ఆయన తన చర్యలను మార్చుకుని పార్టీనిపటిష్టం చేసేందుకు కృషిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీరాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన సమైక్యం కోసం చేయని ప్రయత్నం లేకుండానే అన్ని చేసేశారు. అయితే అధిష్టానం నుంచి ఖచ్చితమైన అభిప్రాయం వెల్లడి కావడంతో ఇక చేసేదేమి లేక పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేసేందుకు చిట్టచివరి అవకాశంగా నడుం బిగించారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం నిన్నమొన్నటి వరకు మెడపై కత్తిపెట్టిన టిడిపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు తీసుకున్న యూటర్న్‌ విధానంపై తీవ్రంగా మండిపడుతున్నారు. 2008లేఖకు కట్టుబడి ఉన్నా మని చెప్పిన చంద్రబాబు తీరా నిర్ణయం తీసుకున్నాక సీమాంధ్ర నేతలను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారని నిప్పులు చెరిగారు. అలాగే వైఎస్‌ విజయమ్మ సైతం ప్లీనరీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి నేడు దీక్షలకు దిగడం ఏంనీతిఅని ప్రశ్నిస్తున్నారు. విజయమ్మగుంటూర్‌లో వీధినాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. టిడిపి నేతలను ఎందుకు కట్టడి చేయడంలేదని బాబునునిలదీశారు. పార్టీనిదోషిగా చూపించేందుకు రెండుపార్టీలు చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టడమేకాక పార్టీనిరాష్ట్రంలో పటిష్టంచేసేందుకు చర్యలు తీసు కుంటున్నారు.ఇందుకోసం ఆయన ఇరుప్రాంతాల నేతలతో సమావేశం అవుతూరెండు ప్రాంతాలమద్య పెరు గుతున్న గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నాసరే తానుతీసుకున్న నిర్ణయమే సరైనదని గట్టిగా నమ్ముతున్నాడు. ఇదే విధానం సరైనదని కేంద్రం తీసుకుంటున్న చర్యలుచూస్తే అర్థం అవుతుందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సత్తిబాబు మద్యలో సమైక్యవాదం బుజాన వేసుకున్నా మళ్లీ మొదట్లోని తెలుగువారు రెండు రాష్టాల్రు ఎందుకు ఉండకూడదనే భావనకు కట్టు బడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. హైకమాండ్‌ చేస్తున్న చర్యలకు అనుగుణంగానే సత్తిబాబు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.