సమ్మె విరమించండి చర్చలకు రండి


ఏపీఎన్‌జీవోలకు జానా పిలుపు
హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలపై సీమాం ధ్రుల్లో తలెత్తిన ఆందోళ నలు తొలగించేందుకు తెలంగాణ ప్రాంత మం త్రులు నడుం బిగించా రు. ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొల గించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ ప్రాంత మంత్రులు శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. వారి ఆందోళనలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీ మంత్రులు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే సమ్మె, నిరసన ర్యాలీలు, ఆందోళనలు విరమించాలని కోరారు. సచివాలయంలోని తెలంగాణకు చెందిన సీనియర్‌ మంత్రి జానారెడ్డి కార్యాలయంలో టీ-మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు సమావేశమయ్యారు. హస్తినలో, రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, పార్లమెంట్‌ జరుగుతున్న తీరుపై విపులంగా చర్చించారు. పోటీ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన తెలంగాణ వెనక్కు పోకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. హైకమాండ్‌ విభజనకు నిర్ణయం తీసుకున్న తరుణంలో, ఆందోళనకు దిగిన వారితో చర్చిద్దామని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీమాంధ్ర ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే, హైకమాండ్‌ తెలంగాణపై మరో కమిటీ వేస్తుందన్న అంశంపైనా మంత్రులు చర్చించారు. అలాంటి వాటిని అంగీకరించబోమని, వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ఒత్తిడి తేవాలని భావించారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేతలందరితో సమావేశమై నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. అలాగే తెలంగాణలోని 10 జిల్లాల్లో తెలంగాణ సాధన విజయోత్సవాలు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. జిల్లా స్థాయిలోనే కాక ఊరూరా సంబరాలు జరపాలని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై శనివారం తెలంగాణ మంత్రులందరు సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. అధిష్టానం వద్ద సీమాంధ్ర నేతల లాబీయింస్త్రకు అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక రూపొందించాలని నిర్నయించినట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాాంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. భేటీ ముగిసిన అనంతరం పొన్నాల లక్ష్మయ్య విూడియాతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు విరమించాలని కోరారు. వారి ఆందోళనలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధమని, చర్చలకు రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తున్నామని, త్వరలోనే తెలంగాణ ప్రాంత నేతలంతా కలిసి సమావేశమై భవిష్య’ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.