చెరిపెయ్యలేని గంటి ప్రసాదం ముద్ర

రాజ్య హింసలో భాగంగా పథకం ప్రకారం హత్యకు గురైన ప్రజాసంఘాల నాయకుడు గంటి ప్రసాదం జీవితాన్ని కృషినీ వివరిస్తున్నారు

సుప్రసిద్ద మావోయిస్టు సిద్దాంతకర్త, కార్మికవర్గ నాయకుడు, రచయిత, వక్త గంటి ప్రసాదంను నెల్లూరులో జూలై 4న హత్య చేయడం ద్వారా ప్రజల మీద జరిగే దుర్మార్గాలను ప్రశ్నించ ేవారం దరినీ బెదిరించ గలిగానని రాజ్యం అనుకుంకటున్నట్టుంది. ప్రజా స్వామిక వేదికల ద్వారా బహిరంగ ప్రజాకార్కలాపాలలో ఉన్నవారికి హెచ్చరికగానే ఈ దారుణ హత్యకు పథక రచన జరిగినట్టుంది కాని ఆయన పొత్తి కడుపులోకి వెన్నెముకలోకి దూసుకుపోయిన మూడు బుల్లెట్లను తొలగించడానికి, కొబ్బరికాయల కత్తితో మెడమీద నరికిన గాయానికీ రెండు శస్త్ర చికిత్సలు జరుగుతుండగానే, మరణ శయ్య మీదనే ఆయన ఆ హంతకులు తనను వ్యక్తిగా చంపగలి గారేయో గాని తన స్ఫూర్తిని చంపలేరని అన్నాడు. అంటే ఆ హంతకులూ, వారి వెనుక ఉన్నవారూ తమ దుర్మార్గ చర్య జరిపిన కొద్ది గంటల్లోనే విఫలమయ్యారు. మాట. అంటే కాదు. ఆ హత్యా స్థలానికి 750 కి.మి దూరంలోని బొబ్భిలిలో ఆ మర్నాడు పెద్ద ఎత్తున ఆశయదీక్షతో జరిగిన అంతిమయాత్ర ఆయన స్ఫూర్తి కొనసాగుతందని మరొకసారి రుజువు చేసంది. నిజంగా గంటి ప్రసాదం జీవితం మానవ వైవిధ్యానికి, బహుముఖ ప్రజ్ఞకూ ఉదా హరణ కాగా ఆయన హత్య రాజ్య హింసకూ, క్రూరత్వానికి ఉదాహరణ. ఆయన 64 సంవత్సరాల జీవితంలో 45 సంవత్సరాల కన్న ఎక్కువగా బహిరంగ, చట్టబద్ద, ప్రజాస్వామిక సంస్థలలోనూ పనిచేశారు. రహస్య, అజ్ఞాత సంస్థలలోనూ పనిచేశాడు. ఆయన మీద డజన్ల కేసులు బనాయించినప్పటికీ అందులోఎన్నింటినో న్యాయస్థానాలు కొట్టివేశాయి. దాదాపుఏ మూడు సంవత్సరాలు ఆయన జైలు జీవితం అనుభవించారు. శ్రీకాకుళం జిల్లా (ప్రస్తుత విజయనగరం జిల్లా) బొబ్బిలి పట్టణంలో 1972లో కార్మికవర్గ కార్యకర్తగా సామాజిక జీవితాన్ని ప్రారంభించిన ప్రసాదం కార్య కలాపాలు దాదాపు అన్ని సామాజిక రంగాలకూ, రాష్ట్రం మొత్తానికి విస్తరించాయి. ఆయన విద్యార్థులలో, యువజనులలో, రచయి తలలో, కార్మికులలో, అమరుల బంధు మిత్రులలో, పార్టీలో, అజ్ఞా త, ప్రత్యామ్నాయ పత్రికలలో, ప్రజాస్వామిక హక్కుల రంగంలో, రాజకీయ ఖైదీలలో పనిచేశారు. మరణించేనాటికి ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అమరుల బంధుమిత్రల సంఘం గౌరవ అధ్యక్షు డిగా, దేశ వ్యాప్తంగా దెవల్యూషనరీ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్డీఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (సిఆర్‌పిపి) కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. బలిజుపేట మండలం చాకరపల్లెలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1949లో పుట్టిన ప్రసాదం బొబ్బిలి పట్టణంలో తల్లి పుట్టింట చదువుకున్నారు. బైటి ప్రభావాలకు గురయ్యే తొలి యవ్వనంలో ఉండగానే 1960ల చివర, ఆయన ఇరుగుపొరుగులలో శ్రీకాకుళ విప్లవోద్యమం ప్రాబల్యంలో ఉండింది. 1970లో డిగ్రి చదువు పూర్తి చేసుకున్న ప్రసాదం చాల సహజంగా ఆ ఉద్యమంతో ప్రభావితు లయ్యారు. ఆ ప్రాంతంలో తొలి పారిశ్రామిక కేంద్రమైన బొబ్బిలి పట్టణం అప్పుడు చక్కెర, జనుపనార మిల్లులలోనూ, వ్యాపార కార్యకలాపాలలోనూ పనిచేసి వేలాది కార్మికులతో ఉండేది.  ఆ నేపధ్యంలో 1972 నాటికే ప్రసాదం ఆ పట్టణంలో కీలకమైన కార్మికవర్గ కార్యకర్తగా మారి మొట్టమొదట కళాసీ సంఘాన్ని స్థాపించారు. కార్మిక సంఘాల రాజకీయాలలకి ప్రసాదం ప్రవేశి స్తున్న సమయంలోనే, శ్రీకాకుళంలో విప్లవోద్యమం ఎదుర్కొన్న భారీ నష్టాల తర్వాత నక్సలైటు శక్తుల పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా 1970లో పుట్టిన జననాట్య మండలి నక్సల్బరీ రాజకీయాల నిప్పు చల్లారిపోకుండా కాపాడాయి. సహజం గానే గంటి ప్రసాదం ఈ రెండు సంస్థలలో క్రియాశీలంగా పాల్గొ న్నారు. చారుమంజుదార్‌ అనుచరుడైన మామిడి అప్పలనూరి గంటి ప్రసాదానికి రాజకీయ గురువ అప్పలనూరి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌) 1970 కాంగ్రెస్‌లో ఎన్నికైన కేంద్ర కమిటీ సభ్యుడు. చారు మంజుదార్‌ మరణం తర్వాత ఆ పార్టీ చీలకలకు గురై వివిధ రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ అప్పల నూరి కొండపల్లి సీతారామయ్య కలసి ఆ పార్టీని కొనసాగించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 1974 నాటికి ఆ సంబంధాల పునరుద్దరణ జరిగి బారత మ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) కేంద్ర ఆర్గనైజింగ్‌ కమిటి ఏర్పడింది. కార్మిక సంఘాలలో విరసంలో జననాట్యమండలిలో ప్రసాదం కృషి ఈ పార్టీ మార్గదర్శకత్వంలోనే సాగింది. ఒకటి రెండు సార్లు పోలీసు నిర్భంధం పోలీసులు మిల్లు యజమానులు సాగించిన దాడులతో ఎమర్జెన్సీ కాలంలో ప్రసాదం అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసి వచ్చింది. ఆ మ్రంలోనే 1977లో అరెస్టయి జైలు పాలయ్యారు. విడుదలయ్యే సమయానికి కె ఎస్‌ కూ అప్పలసూరికి మధ్య భిన్నాభిప్రాయాలు పెరిగి చివరికి అప్పలసూరి సిఓసిలో కొనసాగడం, కెఎస్‌ బైటికి వచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ పేరుతో పని చేయడం జరిగాయి. కెఎస్‌ నాయకత్వంలోని పార్టీ 1980లో పీపుల్స్‌ వార్‌ కాగా, అప్పలనూరి నాయకత్వంలోని పార్టీ 1982లో పార్టీ యూనిటీ అనే పార్టీలో విలీనం అయింది. ఈ కాలంలోనే ప్రసాదం బొబ్బిలిలో గొప్ప ప్రజాదరణ కలిగిన కార్మిఎయక సంఘ నాయకుడిగా ఎదిగారు. ఒక సమయంలో ఆయన హోటల్‌ కార్మికు లు, సినామ ధియేటర్ల కార్మికులు, చక్కెర, జనుపనారా మిల్లుల కార్మికులు, కళాసీలు వంటి విభిన్న కారాఇ్మక రంగాలలో దాదాపు 30 సంఘాలను ఆ కార్మి సంఘాలన్నిటికీ కలిపి సమన్వయ సమితిని కూడ స్థాపించారు. మామిడి అప్పలసూరి 1977లో చనిపోవడంతో 1998లో జాతీయ స్థాయిలోనే పార్టీ యూనిట్‌, పీపుల్స్‌ వార్‌లో విలీనం కావ డంతో ప్రసాదం పీపుల్స్‌ వార్‌లో చేరి మరొకసారి అజ్ఞాతవాసం వెళ్లారు. ఈలోగా ప్రసాదం తమ్ము డు గంటి సుబ్రహ్మణ్యం (రాజన్న రమేశ్‌ పేర్లతో ప్రఖ్యాతుడు) ఇప్పటి వరకూ పీపుల్స్‌ వార్‌ నాయకులలో ఒకరుగా ఉండి 19998 ఆగస్ట్‌లో ఒరిస్సాలోని రాయగడ్‌ జిల్లా కోవర్‌డొస్త్రంగ్‌ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ప్రసాదం పీపు ల్స్‌ వార్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అజ్ఞాత వాసం లోని ప్రచురణల బాధ్యత, ప్రధా నంగా రాష్ట్ర కమిటీ అధికారపత్రిక క్రాంతి బాధ్యత తీసుకున్నాడు.  ఆ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా మారినతర్వాత కూడ 2005 మేలో అరెస్టయ్యే వర కూ ప్రసాదం ఆ బాధ్యతలను నిర్వ హించారు. ప్రసాదం అజ్ఞాత వాసా నికి వెల్లినపుడు ఆ పార్టీ మీద నిషే ధం ఉండింది.  కాని ఆ పార్టీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన సందర్భంలో 2004 జూలైలో ఆ నిషేధాన్ని సడలించారు. ప్రభుత్వానికీ పార్టీకీ మధ్య మొదటి విడత చర్చలు 2004 అక్టోబర్‌లో జరిగాయి. ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నిర్భంధాన్ని బూటకపు ఎన్‌కౌంటర్లను ప్రారంభించటంతో నవంబర్‌లో జరగవలసిన రెండో విడత చర్చలు జరగలేదు. చివరికి తాను కూడ కాల్పుల విరమన ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నానని 2005 జనవరిలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో పార్టీ రాష్ట్రంలోని రాజకీయ సామాజిక స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకుఇన అంచనా వేసే పనిని ప్రారంభించింది. పార్టీ అదికార ప్రతినిధిగా, క్రాంతి సంపాదకుడిగా ప్రసాదం ఉద్యమ సానుభూతి పరుల నుంచి సమాచారం సేకరించే పని మొదలుపెట్టారు. అప్పటికే రాష్ట్రంలో దమనకాండ పెచ్చరిల్లి పోవడంతో తాను కలవదలచిన వాళ్లను రాష్ర్‌టంలో కలవలేనని ఆయన అనుకున్నారు. విరసం సభ్యులు నలుగురిని మహరాష్ట్రకు వచ్చి తనను కలవమని ఆహ్వానించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాదులో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నడిపే గెస్ట్‌ హౌజ్‌లో ఆ మూడు రోజుల సమావేశం రెండో రరోజు ముగుస్తుండగా పోలీసులు విరుచుకుపడ్డారు. వారందరి కళ్లకు గంతలు కట్టి పెడరెక్కలు విరిచికట్టి, మూడు రోజుల పాటు అక్రమ నిర్భంధంలో చిత్రహింసలు పెట్టారు. వేధించారు. ఆ తర్వాత వారి మీద జౌరంగాబాదు కుట్రకేసు బనాయించి నిజామాబాదు జైళ్లో నిర్భందించారు. నిజానికి అప్పటికి పార్టీ మీద నిషేధం లేదు. పార్టీ నాయకులు ఇతరులను కలుసుకోవడం చట్టవ్యతిరేకమూ, కుట్ర పూరితమూ కాదు. ఆ కేసులో ఆయన జైళ్లో ఉండగానే ఆయన మీద పోలీసు స్టేషన్ల మీద దాడి, పోలీసు అధికారుల మీద హత్యా ప్రయత్నం వంటి మరెన్నో కేసులలో నేరారోపణలు మోపారు. కాని ఔరంగాబాదు కుట్ర కేసులోనూ, ఇతర అన్ని కేసులలోనూ ఆయన నిర్ధోషి అని ఆయా న్యాయస్థానాలు ఆ కేసులను కొట్టివేశాయి.

-ఎస్‌ వేణుగోపాల్‌

(తరువాయి భాగం రేపటి సోమవారం సంచికలో)