కృష్ణా జలాల వినియోగంపై చర్చలు…


నిర్ణయానికి రాలేకపోయినా మూడు రాష్ట్రాలు
న్యూఢిల్లీ ఆగస్టు 25(జనంసాక్షి):
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీ లోని కర్ణాటక భవన్‌లో ఆదివారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. కృష్ణా జలాల విని యోగంపై ఒక నిర్ణయానికి రావాలని జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ తర్వాతే ఇతర కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్‌ వాది స్తుండగా ఈ సమావేశంలో ఏకాభిప్రాయం రానందున జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ పున:ప్రారంభం కానుంది. సోమవారం కార్ణాటక ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్‌ వద్ద వాదనలు వినిపించనుండగా  మూడు రాష్ట్రాల ఇంజనీర్లూ మరోసారి సమావేశమవుతారు.