ప్రతిభతోనే సామాజిక గుర్తింపు

– తెలంగాణ కోహినూర్‌ వజ్రం మధుప్రియ
– కన్నులపండువగా జన్మదిన వేడుక
గోదావరిఖని, ఆగస్టు 26 (జనంసాక్షి) :
ప్రతిభకు పదునుపెడితే సామాజిక గుర్తింపు లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. సోమవారం మధురగాయని మధుప్రియ పాటకు 16 ఏండ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండే యకాలనీలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో మధుప్రియ జన్మదిన వేడుక కన్నుల పండువగా జరిగింది. అనాథ విద్యార్థుల మద్య బర్త్‌డే కేక్‌ను మధుప్రియ కట్‌ చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జగిత్యాల ఏఎస్పీ ఆర్‌.రమారాజేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ పాటకు మధుప్రియ మైలురాయి కావాలన్నారు. చిన్నతనంలోనే మహత్తర సామాజిక గుర్తింపును పొందటం అభినందనీయమన్నారు. కేవలం కళకు పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాణం పోయడం శ్లాఘనీయ మన్నారు. మధుప్రియ మార్గంలో కళాకారులు నడుచుకున్నట్లుయితే కళకు సేవా దృక్పథం తలమానికమవు తుందన్నారు. రుగ్మతలను రూపుమాపడానికి పాటతో సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చు నన్నారు. మధుప్రియ తెలంగాణాకు కోహినూరు వజ్రమని, చిన్నవయ స్సులోనే తన పాటలోని మాదుర్యాన్ని చాటిచెప్పుతుండడం మరుపు రానిదని ‘జనంసాక్షి’ ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ అన్నారు. నేడు ప్రజా జీవనంలో ప్రాచుర్యాన్ని పొందుతున్న సినీ ప్రపంచాన్ని తలదన్నేవిధంగా మధుప్రియ గానం ముందుకు అడుగులు వేస్తున్నదని హెచ్‌ఎం టీవీ న్యూస్‌ కో-ఆర్డినే టర్‌ కె.విరహత్‌ అలీ అన్నారు. మధుప్రియ మాట్లాడుతూ చిన్నతనం లోనే తాను ఈ స్థాయికి చేరడం నాకెంతో ఆనం దాన్ని చ్చిందన్నారు. ఆదరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞత కలిగి ఉంటాన న్నారు. చిన్నప్పటి నుండి సినిమా పాటల జోలికి వెళ్ళకుండా జానపద సాహిత్యం ఉట్టిపడే పాటలను పాడడం వల్లనే ఎంతో మంది అభిమానులను సంపా దించుకోగలిగానన్నారు. రానున్న రోజుల్లో కేవలం బర్త్‌డేకే పరిమితం కాకుండా ఎల్లవేళలా ఆపదల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తాన న్నారు. అనంతరం ఆప్తమిత్ర బాలకార్మిక పాఠశాల, ప్రజా పాఠశాల, తబిత ఆశ్రమ పాఠశాల, చెట్టుపల్లి ప్రభుత్వ పాఠశాలలోని అనాధ విద్యార్థిని విద్యార్థులకు దుస్తులను మధుప్రియ పంపిణీ చేసింది. మధుప్రి య పేరున ఫౌండేషన్‌, వెబ్‌సైట్లను ఏఎస్పీ రమారాజేశ్వరి ప్రారంభిం చారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారి కళాకారులు గానకచేరీని నిర్వహించారు. మధుప్రియ ఆలపించిన పాటలు వేడుకలో ప్రత్యేక ఆకర్షనగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు మల్లారె డ్డి, సింగరేణి డెప్యూటీ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, హెచ్‌ఎం టీవీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ బండి రవీందర్‌, హెచ్‌ఎం ప్రతినిధి మధుకర్‌రెడ్డి, స్వచ్ఛం ద సంఘాల ప్రతినిధులు శ్రావణ్‌కుమార్‌, దామెర శంకర్‌, కనకరాజు, వీరేందర్‌, మధుప్రియ తల్లిదండ్రులు మల్లేశ్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.
మనోచైతన్యలో స్వీట్ల పంపిణీ
స్థానిక మనోచైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు మధుప్రియ స్వీట్లు, పండ్లను పంపిణీ చేసింది. మనోచైతన్యకు తగిన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది. కల్లాకపటం లేని మానసిక వికలాంగులను సమాజం గుర్తించాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులతో పాటు మనోచైతన్య నిర్వాహకులు డి. కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.