రూపాయి ఢమాల్‌


చింతించొద్దు.. కోలుకుంటుంది : చిదంబరం
ముంబయి, ఆగస్టు 27 (జనంసాక్షి)
భారత అధికారిక ద్రవ్యం రూపా యి బావురుమంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ఒక్కరోజే రెండు రూపా యలకు పైగా క్షీణించి 66 రూపాయల దిగువకు పడిపో యింది. సరికొత్త రికార్డుతో రూపా యి ఢమాల్‌ మంది. దీంతో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐకి ముచ్చె మటలు పట్టాయి. 64.30 పైసల తో ప్రారంభమైన రూపాయి ఒక దశలో 66.30ని తాకింది. చివరకు 194 పైసలు క్షీణించి 66.24 వద్ద ముగిసింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇచ్చిన హామీ కూడా రూపాయిని కాపాడలేకపోయింది. రూపాయి తీవ్ర పతనానికి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆహార భద్రత బిల్లే కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యాయి.