తెలంగాణ తప్ప చిన్న రాష్ట్రాల ప్రతిపాదన లేదు


లోక్‌సభలో కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) :
తెలంగాణ మినహా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బోడోలాండ్‌, గూర్ఖాలాండ్‌, విదర్భ, బుందేల్‌ఖండ్‌ వంటి రాష్ట్రాల ఏర్పాటు అంశం పరిశీలనలో లేదని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ఓ ప్రకటన చేసింది. ‘అలాంటి ప్రతిపా దనలు ఏవీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేవు’ అని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. బోడోలాండ్‌, గూర్ఖాలాండ్‌, విదర్భ, బుందేల్‌ఖం డ్‌లలో ఆందోళనలు మిన్నంటాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్న రాష్టాల్ర ఏర్పాటు ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో ప్రకటించారు.