మానవీయ విలువలతో వైద్యం చేయండి


మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) :
మనదేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువ ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని బారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యకళాశాలలో వైద్య విద్య పరిశోధనకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఓస్మికాన్‌ సమావేశంలో కలాం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఫైవ్‌స్టార్‌, త్రీస్టార్‌ ఆస్పత్రులు అంతకు మించి హంగులు ఉన్నా మనసుతో వైద్యం చేసే డాక్టర్లు అరుదుగా ఉన్నారని ఆయన చెప్పారు. రోగి మానసిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రోగికి అవసరమున్నా లేకున్నా కనీసం 15 రోగనిర్థారణ పరీక్షలు చేయించేందుకు వైద్యులు సిద్దపడడాన్ని ఆయన తప్పుపట్టారు. వైద్య విద్యార్థులైన మీరంతా ఈ లోపభూయిష్ట విధానాన్ని ఆయన తప్పు పట్టారు.  వైద్య విద్యార్థులైన మీరంతా ఈ లోపభూయిష్ట విధానాన్ని అడ్డుకోవాలని సూచించారు. అణ్వాయుధ దేశంగా భారత్‌ గుర్తింపు పోందిన సమయం కనేఆ్న అర్థోపెడిక్‌ వైద్యంలో వినియోగించే కాలివర్‌ తయారీకి తన వంతు సాయం అందజేయడం, గుండె వైద్యంలో వినియోగించే రాజు-కలాం సెంట్‌ తయారీ వంటి అంశాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్యశాల ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, వైద్య విద్య సంచాలకులు శాంతారావు, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పుట్టా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.