తెలంగాణపై నిర్ణయమైపోయింది


సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే
మీ డిమాండ్లు కమిటీకి చెప్పండి
ఏపీఎన్‌జీవోలు, విజయమ్మతో ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణ యం జరిగిపోయిందని ప్రధాని మ న్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. మంగ ళవారం తనను కలిసిన ఏపీఎన్‌జీ వోలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌర వాధ్యక్షురాలు విజయమ్మతో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఆంద్ర óప్రదేశ్‌ విభజనపై నిర్ణయం అయిపో యింది కాబట్టి దానిపై చర్చించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సీ మాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ వేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలిపారు.  విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థి తులపై ప్రధానికి విజయమ్మ, ఏపీఎన్జీవోలు వివరించారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. 57 ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి విజయమ్మ మూడు పేజీల లేఖ సమర్పించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాల్సిందేనని ప్రధాని స్పష్టం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం ఒక్కరోజుది మాత్రమే కాదని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ అంశం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గుర్తింపుపొందిన పార్టీలు నిర్ణయం ప్రకటించాకే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఈ విషయమై ఒక అభిప్రాయానికి వచ్చిందని తెలిపారు. అంతకుముందు విద్యుత్‌, ఆర్టీసీ ఉద్యోగులు సైతం ప్రధానితో భేటీ అయి తమ సమస్యలు చెప్పుకోబోయారు. మీకున్న సమస్యలను చెప్పుకోవడానికి ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి విన్నవించుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వపరంగా వేసే కమిటీ ముందుకూడా తమ సమస్యలు నివేదించుకోవచ్చని సూచించారు. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించామన్నారు. విభజన ప్రకటనతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని, న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ప్రధానిని కోరామని తెలిపారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశామని, ఒక ప్రాంతానికి న్యాయం చేసి, మరో ప్రాంతానికి అన్యాయం చేయొద్దని కోరామన్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. విభజనతో సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామన్నారు. రాష్ట్రపతిని కూడా కలిసి ఇదే విషయం చెబుతామన్నారు. మంత్రుల కమిటీ రాష్ట్రంలోని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన ద్వారా వచ్చే నీరు, నిధులు, ఉద్యోగాల పంపిణీ, హైదరాబాద్‌ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. విభజన తీరును నిరసిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, జగన్‌మోహన్‌రెడ్డి జైలులో దీక్ష చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. సీమాంధ్ర ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలపై పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తుందని తెలిపారు. ప్రధాని కలిసిన వైఎస్సార్‌సీపీ బృందంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మైసురారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, గొల్ల బాబూరావు తదితరులు ఉన్నారు.