తెలంగాణ పొలిమేరలు దాటేదాక సీఎంను తరిమికొడ్తాం


వరంగల్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటేదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై ఆయన దుర్మార్గంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు.  కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హ క్కు లేదని హరీశ్‌ మం డిపడ్డారు. తెలంగా ణ కు వ్యతిరేకంగా తన అక్కసు వెళ్లగక్కుతున్న  కిరణ్‌ పదవిలో కొన సాగే హక్కు లేద న్నారు. హైకమాండ్‌ను ధిక్కరించేలా మాట్లాడుతున్న కిరణ్‌ను వెంటనే కాంగ్రెస్‌ ఆధిష్టానం బర్తరఫ్‌ చేయాలని హరీష్‌ డిమాండ్‌ చేశారు. కిరణ్‌కమార్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ 52కి ఉప ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో ఓడిపోయిన విషయం గుర్తు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్‌లో మాట్లాడుతూ తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని పరోక్షంగా నడిపేందుకే ఆత్మగౌరవ యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. పదవి, అధికారం కోసం జగన్‌ దేన్నయినా వదులుకుంటాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జగన్‌, విజయమ్మ ఎందుకు దీక్షలు చేయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.