సీఎం సీమాంధ్ర దురహంకారం


నిమ్స్‌ డైరెక్టర్‌గా నరేంద్రనాథ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి తన సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించాడు. తెలంగాణలో అత్యంత కీలకమైన వైద్యం అందిస్తున్న నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థగా (నిమ్స్‌) సంస్థ డైరెక్టర్‌గా రాత్రికి రాత్రి హడావుడిగా  మరోసారి సీమాంధ్రకు చెందిన వ్యక్తి నరేంద్రనాథ్‌ను నియమించారు. డెరెక్టర్‌గా తెలంగాణావారికి అవకాశం కల్పించాలని గత మూడేళ్లుగా తెలంగాణా వారు ఆందోళనలు చేస్తున్నాకూడా  సీమాంధ్ర పాలకులు పట్టించుకోవడం లేదు. తెలంగాణకు చెందిన వారు ఎందరో అర్హులున్నా కూడా రిటైర్‌ అయిన వారిని, ఎక్కడెక్కడినుంచో వెతుక్కుని వచ్చి మరీ నియమించుకుంటూ ఆసుపత్రిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా గతరాత్రి హడావుడిగా సమావేశమైన సెర్చ్‌ కమిటీ ముందు కేవలం అయిదుగురు అందునా అందరిని సీమాంధ్రులను మాత్రమే పిలిచి అందులో ఒక్కరిని ఎంపిక చేయడమేకాక ఉత్తర్వులు కూడా విడుదలచేశారు. ఉత్తర్వులు వెలువడిందో లేదో ఆదివారం సెలవు దినమైనా కూడా నరేంద్ర నాథ్‌ హుటాహుటిన వచ్చి బాధ్యతలు స్వీకరించారు. నిమ్స్‌ ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయితే 14 మంది డైరెక్టర్లు పనిచేయగా ఇప్పటివరకు కేవలం ఒక్కరంటే ఒక్కరే పనిచేశారంటే అతిశయోక్తి మరోటి ఉండదు. ఒకే టర్మ్‌ తెలంగాణాకు చెందిన రాజిరెడ్డి పనిచేశారు. ఉద్యోగ సంఘాల నేత విఠల్‌ మాట్లాడుతూ ఆంధ్రా ఆదిపత్యం కొనసాగించేందుకు చేసే కుట్రలో బాగమే సీమాంధ్ర వ్యక్తిని నియమించారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిన్నటికినిన్న 40సంవత్సరాలు ఉద్యోగం చేసిన వ్యక్తికి రిటైర్డ్‌ అవుతూనే ఉన్న వ్యక్తికి పట్టం గట్టడం దోచుకోవడానికే ఈనిర్ణయం తీసుకుంటామన్నారు. నిమ్స్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారుని, జేఎసి లో చర్చించి ఉద్యమ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. ఈనియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని, దీనిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర నాథ్‌ నియమించడం వెనుక నిధులను దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు రమేశ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తాము వేగంగా ఆందోళనలు చేస్తామంటే టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంయమనం అంటూ చెప్తున్నారని అందుకే వారితో చర్చించాకే కార్యాచరణను ప్రటిస్తామన్నారు.