శాసనసభ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్‌: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల దీక్ష నేపధ్యంలో శాసనసభ లోపల, వెలుపల పోలీసులు భారీగా మోహరించారు. మరి కొద్ది సేపట్లో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టనున్నారు.