హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ


హైదరాబాదొస్తే బడితపూజ తప్పదు
హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ
ఇది ముమ్మాటికీ దురాక్రమణే
అడ్డుకొని తీరుతాం : ఓయూ జేఏసీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సభ పేరుతో హైదరాబాద్‌కు వస్తే బడిత పూజ తప్పదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. వచ్చిన తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ గుండెకాయలాంటి హైద రాబాద్‌లో ఏపీిఎన్జీఓలు సమైక్యాంధ్ర సభను నిర్వహిస్తే ఎట్టి పరిస్థి తుల్లోను సాగనివ్వబోమని ఓయు జెఏసీ స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం వివిధ విద్యార్థి విభాగాలు సమావేశమై పరిస్థితు లపై చర్చించాయి. తెలంగాణలో ఉద్యమాలకు, కనీసం ర్యాలీలకు కూడా అనుమతినివ్వని ప్రభుత్వం ప్రాంతంకాని ప్రాంతంలో సీమాంధ్రులు వచ్చి సభ పెడతామంటే ఎలా అనుమతిస్తారని జేఏసీ సమావేశం సూటిగా పోలీసులను ప్రశ్నించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలను బంద్‌ చేయడమేకాక రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు, ఏ ఒక్కరు కూడా రావద్దని ఓయూ జేఏసీ ప్రతినిధులుయ స్పష్టం చేశారు. రావడం వల్ల ఇక్కట్లకు గురి అవుతారని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీఎన్జీఓల సభకు అనుమతిచ్చినప్పుడు తమకు కూడా ముఖ్యమైన ముల్కి అమరవీరుల ర్యాలీకి అనుమతివ్వాల్సిందేనని సమావేశం అభిప్రాయ పడింది. ఒకవేళ అనుమతినివ్వకపోయినా నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. హైదారాబాద్‌లో హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభకు సీఎం అనుమతి ఇచ్చారని దీనిని దురాక్రమణగానే భావిస్తామని జేఏసీ ప్రతినిధులు చెప్పారు.