బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌


స్వచ్ఛందంగా పాటించిన పది జిల్లాలు
హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని బంద్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా టీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పది జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని రీతిలో బంద్‌ జరిగింది. ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శాంతిర్యాలీకి అనుమతిని టీఎన్జీవోలకు అనుమతివ్వకుండా కేవలం ఏపీఎన్జీవోలసభకు అనుమతినివ్వడాన్ని తెలంగాణవాదులు ఖండించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో బంద్‌ విజయవంతంగా కొనసాగుతోంది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాలకు చెందిన వేలాది మంది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లాల్లో బస్సులు బయటకు రాకుండా ఉండేందుకు డిపోలముందు ఆందోళనలకు దిగారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రహదారుల పై ర్యాలీ  నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో 650 బస్సులు, ఆదిలాబాద్‌లో 650బస్సులు మెదక్‌జిల్లాలో 7 డిపోల్లో బస్సులన్నీ నిలిచిపోచయాయి. హైదరాబాద్‌ నగరంలో సైతం సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణవ్యాప్తంగా కాకతీయ యూనివర్శిటీ, శాతవాహన, తెలంగాణ యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీతోపాటు పలు యూనివర్శిటీల్లో జరుగాల్సిన అన్ని పరీక్షలు, తదితర కార్యక్రమాలను వాయిదా వేశారు. ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలు ముందస్తుగానే తెలంగాణా బంద్‌కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసి వేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌ సందర్భంగా చిన్నచిన్న విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లాలో బస్సు అద్దాలు పగులగొట్టారు. సూర్యాపేట ఎన్‌హెచ్‌ 7వపై ఆందోళనకారులు టైర్లు తగుల పెట్టారు. నార్కట్‌పల్లిలో ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. హైదరాబాద్‌ పట్టణంలో దుఖాణాలన్నీ మూసివేయడంతో నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతో ¬రెత్తుతున్నాయి. మరోసారి ఆరునెలలక్రితం వాతావరణం కనిపించింది. తెలంగాణ వచ్చినంక కూడా ఈపరిస్థితిని సీమాంధ్రులు తేవడాన్ని ఏఒక్క తెలంగాణ వ్యక్తి కూడా జీర్ణించు కోలేకపోతున్నారు. కరీంనగర్‌ డిపోఎదుట ఎమ్మెల్యే గంగులకమలాకర్‌, పార్టీ జిల్లా కన్వీనర్‌ ఈదశంకర్‌రెడ్డి లు స్వయంగా భైఠాయించి ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లాలో బంద్‌ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఆర్టీసీ సహా ఏఒక్క బస్సు కూడా తిరగలేదు. హైదరాబాద్‌ పట్టణంలో పలుచోట్ల ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. పటాన్‌చెరువు, లత్నాపూర్‌లో ఆందోళనకు దిగారు.