మణిపూర్‌లో బాంబు పేలుడు

8 మంది మృతి
ఏడుగురికి గాయాలు
మణిపూర్, సెప్టెంబర్ 14 (జనంసాక్షి) :
శక్తివంతమైన బాంబు పేలి ఎనిమిది మంది మృతి చెందగా.. ఏడుగురు గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. మణిపూర్‌లోని దక్షిణ జిల్లా ఇంఫా ల్‌లోని నాగంపాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభ వించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారేనని సమాచారం. మణిపూర్‌లోని ఇంతర ప్రాంతాలకు చెందిన కూలీలు క్యాంపు వద్ద జరిగిన పేలుడు వెనుక మిలిటెంట్ల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఓ షాపులో బాంబు అమర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందించారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా మణిపూర్‌కు వలస వచ్చిన వారేనని తెలిసింది. బాంబు పేలుడు తీవ్రత కిలోమీటర్ వరకు వ్యాపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పేలుడుకు ఎవరు కారణమన్నది తెలియాల్సి ఉంది.



