వచ్చే ఏడాదిలో భూ సేకరణ బిల్లు
కేంద్రమంత్రి జైరాం రమేశ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) :
వచ్చే ఏడాదిలోగా భూ సేకరణ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల నియంత్రణలో ఈ చట్టం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఆరేడు సంవత్సరాల్లో జార్ఘండ్, ఛత్తీస్‌గఢ్, ఓడిశా తదితర రాష్ట్రాల్లో నక్సలిజాన్ని క్రమంగా కనుమరుగు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే రెండు నెలల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు రూపొందిస్తుందని ఆయన చెప్పారు. ఈ చట్టం భూ సేకరణలో భూమి యజమానులకు సహేతుకమైన పరిహారం అందేలా చేస్తుందన్నారు.



