పేదల కోసం మేము.. పెద్దల కోసం నీవు

గుజరాత్ అభివృద్ధి సామాన్యుల కోసం కాదు
మోడీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి)
కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే, మోడీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొ న్నారు. మంగళ వారం జైపూర్‌లోని బరాన్ పట్టణంలో గిరిజనులు, రైతుల మహా సభలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షే మం కోసం చట్టాలు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నించిన ప్రతిసారి ప్రతి పక్షాలు పెడబొబ్బలు పెడుతున్నా యన్నారు. సంపన్నులు, పారిశ్రా మిక వేత్తల ప్రయోజనాలకు సంబం ధించినవైతే వారికి ఎలాంటి అభ్యం తరం ఉండదని ఎద్దేవా చేశారు. మోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేస్తుం ది పేదల కోసం కాదని, సంపన్నుల కోసమన్నారు. యువజనులే దేశా నికి బలీయమైన శక్తి అని, వారు కలలు కనడమే కాదు వాటిని సాకా రం చేసుకోవాలని, ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలోని పేదల ఆకలిని శాశ్వతంగా నిర్మూలించేందుకే ఆ హార భద్రత చట్టం తీసుకువచ్చా మని, వారి కాళ్లమీద వారు నిల బడేలా కృషి చేస్తామన్నారు. కార్మి కుడి కొడుకు విమానంలో తిర గాలన్నదే తమ పార్టీ ధ్యేయమని, పేదరికానికి నిరుద్యోగం ఒక్కటే కారణం కాదని, తరచూ తలెత్తే ఆరోగ్య సమస్యలు, వ్యాధులు కూడా కారణమని రాహుల్ అభిప్రాయ ుపడ్డారు. సామాన్యుడు కూడా మంచి జీవితం కోసం, మంచి అవకాశాల కోసం కలలు కనాలన్నదే తమ పార్టీ అభిమతమని చెప్పారు.



