కెన్యాలో ముంబయి తరహా దాడి

ఇద్దరు భారతీయులతో 39 మంది దుర్మరణం
పాక్‌లో పేలుడు.. 78 మంది మృతి
నైరోబీ/పెషావర్, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) :
కెన్యా రాజధాని నైరోబీ నగరంలో ముంబయి తరహా ఉగ్రవాద దాడి జరిగింది. ఒక షాపింగ్ మాల్‌లో శనివారం దాడి జరిగింది. ఉగ్రదాదుల దాడిలో 39 మంది మరణించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఉన్నట్టు అధికారులు న్యూఢిల్లీలో ధ్రువీకరించారు. నైరోబీలోని భారత ప్రభుత్వరం గ బ్యాంకు అయిన బ్యాంక్‌ఆఫ్ బరోడా మేనేజర్ కుమారుడు పరాంశజైన, ఫార్మా కంపెనీలో పని చేస్తున్న శ్రీధర్ నటరాజన్ మృతి చెందారు. తీవ్రవాదుల దాడిలో మరో నలుగురు భారతీయులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన వ్యక్తులు నైరోబీ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు సంఘటపపై ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు అనేత దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌లో మరోమారు హింస చోటు చేసుకుంది. పెషావర్‌లోని ఒక ప్రార్ధనామందిరం సమీపంలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 78 మంది దుర్మరణం చెందారు. మరో 60మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందర్నీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు మరో నలుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. మానవ బాంబు పేలుడు సమయంలో ప్రార్ధనామందిరంలో సుమారు 500మంది ఉన్నట్టు సమాచారం. ప్రార్ధనమందిరం నుంచి అందరూ బయటకు వస్తున్న సమయంలో ఒకరు బాంబుతో తనను తాను పేల్చుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.



