సరిహద్దు నియంత్రణ పాటిద్దాం

న్యూయార్క్ :
సరిహద్దు నియంత్రణను ఇరు దేశాలు పాటించాల్సిన అవసర ముందని భారత ప్రధాని మన్మో హన్ సింగ్ కోరారు. పాక్ ప్రధా ని నవాజ్ షరీఫ్‌తో ఆయన సమా వేశమయ్యారు. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావే శంలో సమాంతర ఉగ్రవాదంపై నవాజ్ షరీఫ్‌ను ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. జమ్మూలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించారు. సరిహద్దులో కాల్పుల విరమణను కొనసాగించాలని కోరారు. భారత్ వ్యతిరేక శక్తులను పాక్ నుంచి వెళ్లగొట్టాలని భారత ప్రధాని కోరారు. భారత పాకిస్థాన్‌ల మధ్య గల వాస్తవధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నివారణకు ఇరుదేశాల సంయుక్త యంత్రాంగం ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు.



