తెలంగాణలో నక్సల్స్ సమస్య ఉండదు

రాష్ట్రం విడిపోయినప్పుడు భావోద్వేగాలు సహజమే
హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పడితే నక్సల్స్ సమస్య ఉండదని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. శుక్రవారం షిండే ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. మిగతా వాటన్నింటికంటే తెలంగాణ అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నక్సలిజం సమస్య ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. విభజన సమయంలో ఇటువంటివన్నీ సహజమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇలాంటి మనోభావాలు సహజమేనని, ఇలాంటప్పుడు అవతలి వారిని ఓదార్చడం తప్ప మరేవిూ చేయలేమన్నారు. ఏ ఒక్కరూ ఈ మనోభావాలకు అతీతులు కారని చెప్పారు. వారందరికీ నచ్చజెప్పేందుకు తాము యత్నిస్తామని తెలిపారు.తెలంగాణ ఇవ్వడం వల్ల నక్సల్స్ సమస్య వస్తుందన్న అభిప్రాయం ఉంది కదా? అని విలేకరులు ప్రశ్నించగా… రాష్ట్ర విభజన తర్వాత నక్సలైట్ సమస్య తలెత్తదన్నారు. నక్సలిజాన్ని అణచివేయడంలో అద్భుతంగా పని చేసిన రాష్టాల్ల్రో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి అని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నక్సల్స్ సమస్య ఉండదని చెప్పారు. సీమాంద్రలో కూడా నక్సల్స్ సమస్య తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన తర్వాత కూడా నక్సలైట్ సమస్యను ఎదుర్కొంటారనే నమ్మకం ఉందన్నారు. బోడోలాండ్, గుర్ఖాల్యాండ్‌ల డిమాండ్‌లపై ప్రశ్నించగా.. తాము ప్రస్తుతం తెలంగాణ అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నామని బదులిచ్చారు. మిగతా రాష్టాల్ర డిమాండ్ల కంటే ప్రస్తుతానికి తెలంగాణ ఏర్పాటే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై క్యాబినెట్‌లో తమ సహచరులు పలు అభ్యంతరాలు తెలిపారని చెప్పారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను, ఆందోళనలను కేంద్ర మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాజీనామాలను ప్రస్తావించగా.. ఆయన తేలిగ్గా తీసుకున్నారు. విభజన సమయంలో ఇలాంటివన్ని సహజమేనని తెలిపారు.



