ఈటీసీఏ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ

దుబాయ్ : షార్జా నేషనల్‌లో శుక్రవారం ఎమరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈటీసీఎ నిర్వహించబోయే సంయుక్త సంబరాల నిర్వహ ణపై సంఘ వ్యవస్ధాపకులు, అధ్యక్షుడు పీచర కిరణ్ కుమార్ అధ్యతన సమావేశం జరిగింది. ఇందులో కార్యక్రమ వివరాలు తెలిపారు. 14.10. 2013 సోమవారం రోజున షార్జా నేషనల్ లో సాయంత్రం 4.30 నిమిషాల నుండి 10 గంటల వరకు ఎమరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్వర్యంలో ఘనంగా దసరా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. బతుకమ్మ దసరా సంబరాలను ఈటీసీఎ మహిళా విభాగంలోని 20 మంది సభ్యులను నిర్వాహకులుగా నియమించారు. పెత్ర అమావాస్య, నవ రాత్రులలో మొదటి దినాన్ని పురస్కరించుకొని దసరా బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను మహిళ సభ్యులు విడుదల చేశారు. బాలికల కోలాటాలు, అందమైన బతుకమ్మ పోటి, వాయిస్‌ఆఫ్ బతుకమ్మ పాటల పోటీలు,బాల బాలికల కోసం సంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తామని ,లక్కీడిప్‌ద్వారా సర్ప్రయిసింగ్‌బహుమతులు కూడ అందచేస్తామని తెలిపారు. హాజరయ్యేప్రతి ఒక్కరికి ఈటీసీఎ బతుకమ్మ ప్రసాదం, అల్పాహారం అందచేస్తామని నిర్వాహకులుతెలిపారు. సుమారు 1500 నుండి 1800 మందివరకు సంబరాలకు హాజరువుతారని పెరుకున్నారు. అబుధాబి,పుజేర,రస్,అల్‌ఖైమా,ఒమన్ నుండి కూడ సుమారు 20 నుండి 25 కుటుంబాలుకార్యక్రమానికి హాజరువుతున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి స్పెషల్‌గెస్ట్‌గా టీన్యూస్ ఛానల్ వాక్యత శ్రీలత , లోకల్‌గెస్ట్‌గా మాజీ పార్లమెంట్‌సభ్యులు డాక్టర్ సుగుణ కుమారి ,హైకోర్టు న్యాయమూర్తులు ,పోగ్రాం మెయిన్ స్పోన్సర్ మంచుకొండ వెంకటేశ్వర్లు,డబ్ల్యూవీఈ అధ్యక్షులు గీత రమేష్ సామాజిక సేవకురాలు ఉమ హాజురువుతారని నిర్వహకులు పెరుకున్నారు. కార్యక్రమానికి మహాశ్వేత ఫుడ్ స్టఫ్ ట్రేడింగ్ మెయిన్ స్పోన్సర్‌గా టీన్యూస్ ,వీ6,హెచ్‌ఎం టీవీ ఛానల్స్‌మీడియా పార్టనర్స్ గావ్యవహరిస్తున్నారని నిర్వహకులు పేర్కొన్నారు. సోనాపూర్,శార్జ రోల అజమాన్ అల్కూజ్ ప్రాంతాల నుండి 10 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.
కొండ సౌజన్య..
దుబాయ్‌లో ఉన్న కుటుంబాలు అన్ని కలిసి బతుకమ్మ ఆడటం ,ప్రక్కగల్ఫ్ దేశాలనుండి మేము నిర్వహించే కార్యక్రమానికి హాజరవడం,మనస్వంత ఊరిలో జరిగినట్టు ప్రతి ఒక్కరు అనుబూతిని పొందటం,పండుగనుపురస్కరించుకొని మహిళల కోసం వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందచేయటం ,తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ కుల మత ,పేద ధనిక తారతమ్యత లేకుండా గల్ఫ్ దేశంలో నివసిస్తున్న మనవారంత ఒక కుటుంబల కలిసే పండుగ చేసుకోవండ నిజంగా ఆనందాయకం.ఇలాంటి వేదికను కల్పించిన ఈటీసీఎ కు మహిళల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈటీసీఏలో మహిళ సభ్యురాలిగా బతుకమ్మ పండుగ రోజే చేరాను.ఇలాంటి వేడుకలు రాబోయే బావి తరాలకు మనప్రాంత సంస్కృతి,సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,తెల్సెల కృషి చేస్తాయి. కార్యక్రమానికి మహిళలు,అందరు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయపద్రం చేయాగలరని కోరారు. ఈకార్యక్రమంలో ఈటీసీఎ మహిళ విభాగం సభ్యులు ప్రీతీ,సౌజన్య,రశిత,సారిక ,స్వాతి,పద్మ,మాధవి,లత,సుమలత,లక్ష్మీ,ప్రియాంక,ప్రనిత,సుజాత తదితరులు పాల్గొన్నారు.



