చర్చించుకుందాం రండి

సీమాంధ్రులకు జైపాల్ స్నేహ హస్తం
అనేక సమస్యల పరిష్కారమే తెలంగాణ
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 5 (జనంసాక్షి) :
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలకు అద్దం పడుతోందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమం చూస్తుంటే ఆందోళన, ఆవేదన కలుగుతోందన్నారు. వారి ఆందోళనకు పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. సీమాంధ్రులు ఇంతలా ఆవేదన పడాల్సిన అవసరం లేదన్నారు. వారు లేవనెత్తే అన్ని సమస్యలకు మంత్రుల బృందం తగిన పరష్కారం చూపుతుతందన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్రులు వారు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికే కేంద్రం మంత్రుల బృందం ఏర్పాటు చేసిందని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించలేనంత పెద్దవేవిూ కాదన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయం వచ్చినందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఓ ఒక్కరి విజయమో, అపజయమో కాదన్నారు. వ్యాపార ధృక్కోణంలో చూస్తే హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఎవరైనా ఇక్కడ నివసించవచ్చన్నారు. తాను బతికుండగా సీమాంధ్రులకు అన్యాయం జరగనివ్వబోనని హావిూ ఇచ్చారు. తాను 2009లో చేవెళ్లలో పోటీ చేసినప్పుడు అక్కడి సీమాంధ్రులు తనకు ప్రేమతో ఓటేశారన్నారు. హైదరాబాద్‌లో ఉండే ఉద్యోగులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. హైదరాబాద్ ఎక్కడికీ పోదని, ఎవరూ తీసుకెళ్లలేరని, చార్మినార్ 400 ఏళ్ల నుంచి లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు చితన్య వంతులని తాను అనుకుంటున్నానని, ఇలా నిరాశపడొద్దని సూచించారు. చిన్న రాషాలె వల్ల తెలుగు ప్రజల్లో భావసమైక్యత పెరుగుతుందదన్నారు. తాను రాజీకీయాల్లోంచి రిటైర్ అయితే విశాఖలో అయినా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా నలుగుతన్న అనేక సమస్యలకు పరిష్కారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రుల బృందం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రలో జరుగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అయితే సీమాంధ్ర ప్రజలు ఇంత ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానాలుంటే కేంద్ర మంత్రుల బృందానికి వివరించొచ్చని తెలిపారు. మంత్రుల బృందం నివేదిక ఇవ్వడానికి ఇంకా ఆరు వారాల సమయం ఉందని పేర్కొన్నారు.చిన్న రాష్టాల్ర వల్ల తెలుగు ప్రజల్లో భావ సమైక్యత పెరుగుతుందేగానీ తగ్గదని పేర్కొన్నారు. రాష్టాల్రుగా విడిపోతున్నామేగానీ, తెలుగు ప్రజలు విడిపోవడంలేదుగా అని అన్నారు. దీంతో తెలుగు భాషవిూద సాహిత్యం విూద అభిమానం పెరుగుతుందని వివరించారు.



