రాష్ట్రపతి పాలన యోచనలేదు : షిండే


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న యోచన కేంద్రానికి లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందేనన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానికి నలుగురు కేంద్ర మంత్రులు తమ రాజీనామాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆమోదం పొందుతాయని తాను అనుకోవడం లేదన్నారు. ఆంటోని కమిటీకి, మంత్రివర్గ బృందానికి సహకరించాలని ఆ నలుగురు మంత్రులకు సూచించామని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాగానే అసెంబ్లీకి కేబినెట్‌ నోట్‌ పంపిస్తామన్నారు.

తాజావార్తలు