7వ తరగతి విద్యార్థులకు దొరికిన లక్షన్నర రూపాయాలు-పోలిసులకు అప్పగించిన విద్యార్థులు
కరీంనగర్: రోడ్డు మీద నడుస్తున్న ఇద్దరు పిల్లలకు ఏకంగా లక్షన్నర రూపాయాల మొత్తం దొరికింది. బుద్ధిగా దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఆ చిన్నారులు కరీంనగర్‌లోని గణేశ్ నగర్‌లో వరుణ్, విశ్వాన్ అనే ఏడో తరగతి విద్యార్థులకు రోడ్డు మీద పెద్ద మొత్తం డబ్బున్న బ్యాగు కన్పించింది. ఇద్దరూ దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నారు.