మన్మోహన్ సమర్థ ప్రధాని

కాంగ్రెస్, మన్మోహనే నా గురువులు : రాహుల్
సంగ్‌రుర్, అక్టోబర్ 10 (జనంసాక్షి) :
మన్మోహన్‌సింగ్ సమర్థ ప్రధాని అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కితాబిచ్చారు. ప్రధానిపై రాహుల్ ప్రశంసల వర్షం కురిపిం చారు. గురువారం పంజాబ్ రాష్ట్రంలోని సంగ్‌రుర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్‌సింగ్ తనకు రాజకీయ గురువులని పేర్కొన్నారు. ముఖ్యంగా తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి, ప్రధాని తనకు రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగించారని తెలిపారు. మన్మోహన్ చేపట్టినన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకూ ఎవ్వరూ చేపట్టలేదన్నారు. దేశానికి మన్మోహన్‌సింగ్ లాంటి మంచి ప్రధానిని అందించారని ఆయన పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలి పారు. మన్మోహన్ సంకల్పం నిజాయతీతో కూడినదని పేర్కొన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన 2004 నుంచి అభివృద్ధి తీరును ఆయన మార్చివేశారని ప్రశంసల్లో ముంచెత్తారు.



