మరో గంటలో స్పీకర్‌కు బిల్లు అందజేస్తాం : సీఎం
హైదరాబాద్: మరో గంటలో స్పీకర్‌కు తెలంగాణ బిల్లు అందజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ఆవరణలో సీఎంమీడియాతో మాట్లాడుతూ … ఆర్టికల్ 371-డీ సవరణపై బిల్లులో ప్రస్తావించారని సీఎం వెల్లడించారు. సభలో చర్చపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బిల్లులో పేర్కొన్న ప్రతి క్లాజ్ పై ఓటింగ్ జరగాలని స్పష్టం చేశారు. బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందా లేదా అన్నది ఇప్పుడు చెప్పలేమన్నారు. సీక్రెట్ అని రాసి ఉన్నందున టేబుల్ ఐటెంగా లేదా వ్యక్తిగతంగా ఇవ్వాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.